Newsర‌జ‌నీకాంత్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ' బాషా ' సినిమాకు బాల‌య్య ఎందుకు నో...

ర‌జ‌నీకాంత్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ బాషా ‘ సినిమాకు బాల‌య్య ఎందుకు నో చెప్పాడు..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. రజినీకాంత్ అంటే ఆ తరం నుంచి ఈతరం సినిమా ప్రేక్షకుల వ‌రకు ఒక తెలియని పిచ్చి. రజనీ స్టైల్‌, డైలాగ్ డెలివరీ… రజనీ మేనరిజం అంటే యువత ఫిదా అయిపోతుంది. గత రెండున్నర దశాబ్దాలుగా రజనీ నటించిన అన్ని సినిమాలు తమిళంతో పాటు సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. ఇటీవల ర‌జ‌నీ సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పు పొందకపోయినా రజిని సినిమా వస్తుందంటే సౌత్ ఇండియా అంతా ఎంత ఉత్కంఠ తో వెయిట్ చేస్తుంది.

రజనీకాంత్ కెరీర్లో వచ్చిన బాషా సినిమా రజినీకాంత్‌కు తిరుగులేని స్టార్‌డ‌మ్‌ను తెచ్చిపెట్టింది. సీనియర్ డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ర‌జ‌నీకి జోడిగా అందాల నటి నగ్మా నటించింది.
ముంబైని గడగడలాడించిన డాన్ బాషా ఆటో డ్రైవర్ గా ఎందుకు ? మారాడు. ఎందుకు సాధారణ జీవితం గడుపుతున్నాడు ? అన్న అంశాలను బ్యాలెన్స్ చేస్తూ హీరోయిజంతో సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులను ఒక ఊపు ఊపేసింది.

ఈ సినిమా ముందుగా తమిళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తర్వాత తెలుగులో డబ్బింగ్ చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. అయితే దర్శకుడు సురేష్ కృష్ణకు అప్ప‌టికే తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన అనుభవం ఉంది. ఈ సినిమాను డబ్బింగ్ చేయడం కంటే స్టార్ హీరోలతో రీమేక్ చేస్తే బాగుంటుందని.. బాలయ్య లేదా చిరంజీవితో ఈ సినిమాను రీమేక్‌ చేయాలనుకుంటున్నా అని… వాళ్లకు ఓసారి ఈ సినిమా చూపించమని నిర్మాతలకు సూచించారట.

బాషా నిర్మాతలు దేవిశ్రీ థియేటర్లో అప్పుడు టాలీవుడ్ పెద్ద హీరోలకు ప్రత్యేకంగా ప్రివ్యూ షో వేసి చూపించారట. కొందరు హీరోలకు బాషా సినిమా కథ నచ్చలేదు. ఇక బాలయ్య ముందు నుంచి రీమేక్ ల‌పై పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. బాషాలో హీరోయిజం బాగా ఉన్నా… రీమేక్ చేసేందుకు ఆయన ఆస‌క్తి చూపకపోవడంతో అలా బాలయ్య బాషా సినిమా మిస్ అయ్యారు.

చాలా ఏళ్ళపాటు రీమేక్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపని బాలయ్య 2004లో కోలీవుడ్లో విక్రమ్ హీరోగా తెరకెక్కిన సామీ సినిమాకు రీమేక్ గా తెలుగులో జయంత్‌ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ నరసింహా సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. బాషా నిర్మాతలు బాలయ్య – చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో తెలుగులో ఆ సినిమాను రీమేక్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరికి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు.

తెలుగులో బాషా సూపర్ డూపర్ హిట్ అయి ర‌జ‌నీ మార్కెట్ ఇక్కడ కూడా తిరుగులేని విధంగా దూసుకుపోవడానికి కారణమైంది. బాషా తమిళ ప్రింట్ తిరుపతిలో నేరుగా రిలీజ్ చేసినప్పుడు అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఏదేమైనా బాలయ్య లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో బాషా సినిమా రీమేక్ లో నటించి ఉంటే బాలయ్య కెరీర్లోనే ఎప్పట‌కీ నిలిచిపోయే సినిమాలలో ఒకటిగా మిగిలిపోయేది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news