అచ్చ తెలుగు అమ్మాయి మన అంజలి. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో పుట్టిన అంజలి రాజమండ్రిలో కూడా కొద్ది రోజులు చదువుకుంది. అయితే ఆమె చెన్నైలో ఉన్న బాబాయ్, పిన్ని ఇంటి వద్దే ఉంటూ సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేసింది. ముందుగా ఆమె కొన్ని షార్ట్ ఫిలింస్‌లో నటించింది. చెన్నైలో డిగ్రీ చదువుతూనే షార్ట్ ఫిలింస్‌లో ఆమె నటించింది. ఆ తర్వాత ఆమెకు జీవా సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. జీవా పక్కన అంజలి చేసిన సినిమా తెలుగులో డేర్ గా రిలీజ్ అయ్యింది.
డెబ్యూ సినిమా అంజలికి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత 2006లో ఆమెకు ఫొటో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. షాపింగ్‌మాల్ సినిమా అయితే అంజలికి తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అంజలి నటన అచ్చ తెలుగు అమ్మాయిని తలపిస్తోందన్న ప్రశంసలు కూడా వ్యక్తమయ్యాయి. షాపింగ్‌మాల్ నటన చూసే మురుగదాస్ స్వయంగా నిర్మించిన జర్నీ సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడు.
జర్నీ సినిమాతో అంజలికీ స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో విక్టరీ వెంకటేష్‌కు జోడీ కట్టింది. మసాలా సినిమాలోనూ ఆమె వెంకీ పక్కన జోడీ కట్టింది. రవితేజ బలుపు సినిమాలోనూ ఆమె పాత్రకు మాంచి ప్రాధాన్యం ఉంది. ఆ తర్వాత గీతాంజలి సినిమాతో లేడీ ఓరియంటెడ్ రోల్స్ చేసి మెప్పించింది.
అంజలి ఈ స్థాయికి చేరుకోవడం వెనక ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంది. ఆమెను సొంత అనుకున్న వాళ్లే మోసం చేశారట. ఆమె ఎంతో నమ్మిన బాబాయ్, పిన్ని తనను అన్ని విధాలా వాడుకుని మోసం చేశారని ఆమె వాపోయింది. ఆమెను పిన్ని ఓ డబ్బు యంత్రంగా వాడుకుందని.. ఆ విషయం తనకు అర్థం కావడానికి చాలా టైం పట్టిందని.. అప్పటికే తాను చాలా కోల్పోయానని అంజలి ఎన్నోసార్లు వాపోయింది.
చివరకు ఆమె ఎంతో నమ్మిన ఓ తమిళ్ డైరెక్టర్ సైతం అంజలిని ఆర్థికంగా వాడుకుని దెబ్బేశాడట. ఆమెను అందరూ ఓ ఏటీఎంలా వాడుకోవడంతో ఎంతో సంతోషంగా సాగుతోన్న అంజలి ఫ్యామిలీ కష్టాల కడలిలోకి వెళ్లిపోయింది. మొత్తంగా ఆమె నమ్మినవాళ్లే ఆమెను రు. 3 కోట్లకు మోసం చేశారట. అసలు ఈ మొత్తం ఇప్పుడు తిరిగి వస్తుందన్న నమ్మకం కూడా తనకు లేదని అంజలి వాపోయింది.