టాలీవుడ్‌లో ఓ పెద్ద హీరో సినిమా వస్తోంది అంటే చాలు యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం కామన్ అయిపోయింది. సినిమాకు కొంచెం నెగిటివ్ టాక్ వస్తే చాలు సోషల్ మీడియాలో పనికట్టుకుని ఆ సినిమాను ప్లాప్ చేసేందుకు వారు చకోర పక్షుల్లా వెయిట్ చేస్తున్నారు. మొన్నామధ్య రాజమౌళి త్రిబుల్ వచ్చింది. అసలు ఈ సినిమాపై ఉన్న హైప్ మామూలుగా లేదు.
అయితే కొందరు యాంటీ ఫ్యాన్స్ బాగా టార్గెట్ చేశారు. రాజమౌళి వీక్ కథతో సినిమాను చుట్టేశాడని అన్నారు. కారణాలు ఏవైనా బాహుబలి రేంజ్‌లో అయితే వసూళ్లు రాలేదు. రిపీటెడ్ ఆడియెన్స్‌ను కూడా త్రిబుల్ ఆర్ కోల్పోయింది. ఆ తర్వాత మెగాస్టార్ ఆచార్య వచ్చింది. ఆచార్యకు ఫస్ట్ షో నుంచే యాంటీ ఫ్యాన్స్ విరుచుకు పడ్డారు. భారీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో అసలు 10వ వంతు అయినా ఆచార్య ఆడలేదు.
ఇక ఇప్పుడు మహేష్‌బాబు సర్కారు వారి పాట వంతు వచ్చింది. ముఖ్యంగా కొందరు హీరోల ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా టార్గెట్ చేస్తున్నట్టుగా కనపడుతోంది. గతంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురంలో సినిమాలు వచ్చినప్పుడు ఈ ఇద్దరు హీరోల అభిమానులు తమ సినిమాయే గొప్ప అంటూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధాలే చేశారు. ఆ పోరులో అల కాస్త పై చేయి సాధించడంతో పెద్ద రచ్చ జరిగింది.
ఇక ఇప్పుడు సర్కారు వారి పాటను తెల్లవారజు ఝామునుంచే టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసేందుకు ఓ సెక్షన్ హీరోల అభిమానులు కాచుకుని ఉన్నట్టే సోషల్ మీడియా ట్రెండ్స్ చెపుతున్నాయి. సినిమాకు యావరేజ్ టాక్ లేదా ఓ మోస్తరు టాక్ వచ్చినా ఏదోలా సినిమాను ప్లాన్ చేయడం లేదా కనీసం రికార్డులు, కలెక్షన్లు తగ్గేలా చేయడమే వీరు పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అయితే వాస్తవానికి సినిమాకు టాక్ బాగుంటే వీరు చేసే ప్రయత్నాలు ఏవి ఫలించవు.
ఇప్పుడు సర్కారు వారి పాట ఈ కుట్రలను చేధించడానికి కావాల్సింది అల్లా సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడమే..! లేకపోతే తెల్లవారుఝాము నుంచే ఆ సెక్షన్ హీరోల ఫ్యాన్స్ టార్గెట్‌కు బలి కావాల్సిందే. అయితే వీరి ఆశలు ఎలా ఉన్నా బయట మాత్రం సర్కారుకు రిలీజ్‌కు ముందే అదిరిపోయే టాక్ అయితే వచ్చేసింది. అదే టైంలో మహేష్ ఫ్యాన్స్ ఈ ట్రోలింగ్ దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు రెడీగానే ఉన్నారు. ఓవరాల్‌గా ఈ సారి ఈ ట్రోలింగ్ వార్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో ? చూడాలి.