Moviesఈ టాలీవుడ్ హీరో, హీరోయిన్ల‌కు పెళ్లెప్పుడో... ఈ ముదురు స్టార్స్ వ‌య‌స్సులు...

ఈ టాలీవుడ్ హీరో, హీరోయిన్ల‌కు పెళ్లెప్పుడో… ఈ ముదురు స్టార్స్ వ‌య‌స్సులు ఎంతంటే..!

పెళ్లి అనేది జీవితంలో ప్ర‌తి ఒక్క‌రికి ఎంతో కీల‌కం. పుట్టుక‌, చావు మ‌ధ్య‌లో పెళ్లి అనేది కంజ‌క్ష‌న్‌గా ఉంటుంది. పెళ్లి అనేది ఆడ‌వాళ్ల‌కు అయినా, మ‌గ‌వాళ్ల‌కు అయినా ఓ నిర్దిష్ట‌మైన వ‌య‌స్సులో జ‌ర‌గాల‌ని చెపుతూ ఉంటారు. ఇక ఇటీవ‌ల కాలంలో సినిమా సెల‌బ్రిటీల ప‌రిస్థితి మ‌రింత విచిత్రంగా ఉంది. హీరోయిన్లు కూడా 40 ఏళ్లు దాటుతున్నా పెళ్లి అన్న మాటే అన‌డం లేదు. ఇంకా ఏదైనా మంచి ఆఫ‌ర్లు వ‌స్తాయా ? అని వెయిట్ చేస్తూనే ఉన్నారు.

35 – 40 ఏళ్లు దాటుతున్నా పెళ్లి అన్న మాట లేకుండా బ్యాచిల‌ర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఆ హీరో, హీరోయిన్లు ఎవ‌రు వాళ్ల వ‌య‌స్సు ఏంటో చూద్దాం. 40 క్రాస్ అవుతున్నా ముదురు ముద్దుగుమ్మ అనుష్క పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. తాజాగా ఆమె న‌వీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. ఇక 35 దాటిని అస‌లు పెళ్లి మాటే ఎత్త‌ని హీరోయిన్ల‌లో అనుష్క‌తో పాటు నయనతార – త్రిష – శృతిహాసన్ – నిత్యామీనన్ – అంజలి ఉన్నారు. వీరిలో న‌య‌న‌తార‌, శృతీహాస‌న్ మాంచి జోరుమీదున్నారు.

న‌య‌న్ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమ‌లో ఉన్నా పెళ్లి మాట మాత్రం ఎత్త‌డం లేదు. వీరు కొంత కాలంగా స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. న‌య‌న్ వ‌య‌స్సు 37 దాటేసింది. త్వ‌ర‌లోనే 38కు చేరువ అవుతోంది. ఇక శృతీహాస‌న్ మాజీ భాయ్‌ఫ్రెండ్‌తో నాలుగేళ్లు స‌హ‌జీవ‌నం చేసింది. తాజాగా మైఖేల్ కోర్స‌ల్‌తో డేటింగ్‌లో ఉంది. ఆమె వ‌య‌స్సు కూడా 36. ఇక పైన చెప్పుకున్న‌ట్టు అనుష్క 40 +లో ఉన్న కుర్రాడు న‌వీన్ పోలిశెట్టితో సినిమా రొమాన్స్‌కు రెడీ అయిపోయింది.

త్రిష వ‌య‌స్సు 39.. ఓ సారి ఎంగేజ్‌మెంట్ అయ్యి క్యాన్సిల్ అయ్యింది. అస‌లు ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ త‌ర్వాత పెళ్లి అన్న మాటే త్రిష నోటి నుంచి రావ‌డం లేదు. నిత్యామీన‌న్ 34 ఏళ్లు దాటుతున్నా ఇంకా పెళ్లి చేసుకోవ‌డం లేదు. సినిమాలు.. ఓటీటీ షోల‌తో ర‌చ్చ చేస్తోంది. తెలుగ‌మ్మాయి అంజ‌లి 35 + లో ఉన్నా పెళ్లి చేసుకోకుండా సినిమాలు, వెబ్‌సీరిస్‌లు చేస్తోంది.

హీరోయిన్ల ప‌రిస్థితి ఇలా ఉంటే హీరోలు కూడా ఏజ్ బార్ అవుతున్నా ఇంకా పెళ్లి చేసుకోవ‌డం లేదు. ప్ర‌భాస్ 42 ఏళ్లు దాటేశాడు. బాహుబలి 2 త‌ర్వాత పెళ్ల‌న్నాడు. ఆ త‌ర్వాత కూడా రెండు సినిమాలు చేశాడు. బాహుబ‌లి 2 వ‌చ్చి ఐదేళ్లు దాటుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. శ‌ర్వానంద్ కూడా 38 లోకి వ‌చ్చేశాడు. త‌న రేంజ్‌కు త‌గ్గ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు కాని.. పెళ్లి అంటే దూరం జ‌రుగుతున్నాడు.

సాయిధ‌ర‌మ్ తేజ్‌కు 35 క్రాస్ అవుతోంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు అయితే చూస్తున్నారు. ఉస్తాద్ రామ్ వ‌య‌స్సు 33కు రావ‌డంతో ఇంట్లో పెళ్లి చేసుకోమ‌ని స‌తాయిస్తున్నార‌ట‌. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ 32లో ఉన్నాడు. ఇంట్లో సంబంధాలు అంటున్నా ఓ హీరోయిన్‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. నాగ‌శౌర్య 33 లో ఉన్నాడు. అత‌డికి కూడా అమ్మ సంబంధాలు చూస్తోంద‌ట‌. అడ‌విశేష్ 36 దాటుతున్నాడు. తాను ప్రేమ‌లో ఉన్నాన‌ని ఇప్ప‌టికే చెప్పేశాడు. మ‌రి ఈ ముదురు ముద్దుగుమ్మ‌లు, హీరోలు పెళ్లెప్పుడు చేసుకుని బ్యాచిల‌ర్ లైఫ్‌కు ఎండ్ కార్డు వేసుకుంటారో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news