మన తెలుగు సినిమాల హీరోలు ఒక్క హిట్ పడితే చాలు రెమ్యునరేషన్‌ను తీసుకువెళ్లి ఆకాశంలో పెట్టేస్తున్నారు. స్టార్ హీరోలు రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కారు. అస్సలు వెనక్కు తగ్గరు. మరి కొందరు అయితే ఏకంగా రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా కూడా అడుగుతున్నారు. ఇక చిన్న హీరోలు కూడా తాము స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోమని తమ రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు.
మాస్‌కా దాస్‌గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాడు విశ్వక్‌సేన్. ఇటీవల వచ్చిన అశోకవనంలో అర్జునకళ్యాణం సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు విశ్వక్ చేసిన ఫ్రాంక్ వీడియోపై టీవీ 9 డిబేట్ పెట్టడంతో పెద్ద రచ్చ నడిచింది. చివరకు విశ్వక్ వర్సెస్ టీవీ 9 దేవి నాగవల్లి మధ్య పెద్ద వివాదం నడిచింది.
అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. సర్కారు వారి పాట రావడంతో ఈ సినిమాను చాలా చోట్ల ఎత్తేశారు. విశ్వక్‌కు ఈ సినిమాతో నటుడిగా మంచి మార్కులు పడ్డాయి. అటు థియేటర్ కలెక్షన్లతో పాటు ఇటు ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా దుమ్ము రేపుతోంది. ఈ క్రమంలోనే విశ్వక్ తన నెక్ట్స్ సినిమాలకు రేటు పెంచేస్తున్నాడట.
ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు మహా అయితే కోటి నుంచి కోటిన్నర మధ్యలో తీసుకునే విశ్వక్ ఇప్పుడు తనతో సినిమాలు చేసేందుకు ముందుకు వస్తోన్న సినిమాల నిర్మాతలకు కొత్త రేటుతో చుక్కలు చూపించేస్తున్నాడట. ఇప్పుడు ఒక్కో సినిమాకు రు. 3 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడట. రెమ్యునరేషన్ విషయంలో ఒక్క మెట్టు కూడా కిందకు దిగను అన్నట్టుగానే విశ్వక్ ఉన్నాడట.