Moviesతెలిసి తెలిసి తప్పు చేస్తున్న విశాల్.. చాలా రిస్క్ చేస్తున్నాడే..!!

తెలిసి తెలిసి తప్పు చేస్తున్న విశాల్.. చాలా రిస్క్ చేస్తున్నాడే..!!

విశాల్..తెలుగువాడే అయినా తమిళనాట స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నారు విశాల్. ఈ కోలీవుడ్ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవ్వరి స్టైల్ ఫాలోకాకుండా..నచ్చిన సినిమాలను చూస్ చేసుకుంటూ..తెర పై కొత్త కధలతో..అభిమానులకి దగ్గర అవుతున్నాడు. యాక్షన్ హీరో గా పేరు తెచ్చుకున్న హీరో విశాల్‏కు కేవలం తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఆయన నటించిన తమిళ్ చిత్రాలు తెలుగులో కూడా డబ్ చేసి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగులో విశాల్‏కు అభిమానులు ఎక్కువే ఉన్నారు.. ఆయన సినిమాలకు తెలుగులో ఆదరణ ఎక్కువే ఉంది. పక్కాగా చెప్పాలంటే పందెం కోడి సినిమా సూపర్ హిట్ అయ్యాకనే ఆయనకు మాస్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా అనే ట్యాగ్ ఇచ్చారు. పొగరు, భరణి లాంటి సినిమాల్లో కంటెంట్ అటుఇటుగా ఉన్నా కమర్షియల్ గా పాస్ అయ్యాయి. దీంతో తమిళంతో పాటుగా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు.

కాగా, రీసెంట్ ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే..బిగ్ రిస్క్ చేస్తున్నాడు అనే అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతం విశాల్ నటించిన సినిమా లాఠీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ క్రమంలోనే ఆగస్ట్ 15 న ఇండిపెండెన్స్ డేని దృష్టిలో పెట్టుకుని లాఠీ సినిమా రిలీజ్ డేట్ ని విశాల్ ఆగస్ట్ 12కి లాక్ చేశారు. కానీ, ఆల్ రెడీ ఆ డేట్ కి దగ్గరలోనే అంటే 11న నాగచైతన్య లాల్ సింగ్ చద్దా రెడీ గా ఉంది. దీని కోసం ఏకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా స్క్రీన్ల కేటాయింపు మొదలైపోయింది.

ఇక అదే రోజు విక్రమ్ నటించిన కోబ్రా మొన్నే లాక్ చేసుకుంది. ఇక ఆగస్ట్ 12 న సమంత యశోద లాక్ చేసుకున్నారు. చిరంజీవి సినిమా కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మరి ఇన్ని భారీ సినిమాల మధ్య విశాల్ ఇలాంటి రాంగ్ స్టెప్ ఎలా వేస్తున్నాడో తెలియడం లేదు. మరి విశాల్ కాన్ఫిడెన్స్ ఏంటో చూడాలి…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news