టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్‌ను కలిశారు. త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌ను కలవడంలో పెద్ద వింతేమి లేకపోవచ్చు. కానీ వీరిద్దరి మధ్య చెడిందన్న గుసగుసలు గట్టిగా వినిపించాయి. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో అరవింద సమేత వీరరాఘవ సినిమా వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే అందులో త్రివిక్రమ్ మ్యాజిక్ కంటే కూడా ఎన్టీఆర్ యాక్టింగ్, ఎమోషనల్ నటన.. ఇవే సినిమాను హిట్ చేశాయి.
ఓ అత్తారింటికి దారేది, ఓ అల వైకుంఠపురం రేంజ్‌లో బలమైన కథ, కథనాలు అయితే ఉండవు. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్‌తో నెట్టుకు వచ్చేశాడు. అదే సినిమా మరో హీరో చేస్తే ఫలితం వేరేగా ఉండేది. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషనే పట్టాలు ఎక్కాల్సి ఉన్నా ఆగిపోయింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ అని.. మరొకటి అని రకరకాలు వార్తలు వచ్చాయి. ఈ లోగా త్రివిక్రమ్.. మహేష్‌తో ఫిక్స్ అయిపోయాడు.
ఇక ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఒకరికొకరు దూరం అయిపోయినట్టే అన్న గుసగుసలు వచ్చాయి. ఓ సినిమా ఆగిపోతేనే దూరం వచ్చేసి.. సంబంధాలు చెడిపోవాల్సి వస్తే అసలు టాలీవుడ్‌లో ఎవరి మధ్య మాటలు ఉండవు. గతంలో ఎన్నో సినిమాలు అనుకుని.. షూటింగ్ స్టార్ట్ అయ్యాక కూడా ఆగిపోయినవి ఉన్నాయి. అయితే త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌తో గ్యాప్ పెంచుకోవాలని అనుకోవడు.. బన్నీ – మహేష్‌తో మూడేసి సినిమాలు చేసేసి ఉన్నాడు.
ఇప్పుడు ఎన్టీఆర్‌తో తన రేంజ్‌కు తగిన సినిమా చేస్తే త్రివిక్రమ్ క్రేజ్ మరో స్థాయిలో ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ పుట్టిన రోజును తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. లోపలకు వెళ్లిన వెంటనే ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్‌ను సాదరంగా ఆహ్వానించగా.. త్రివిక్రమ్ బర్త్ డే విషెస్ చెప్పి.. కాసేపు పిచ్చా పాటి మాట్లాడుకున్నారట.
ఈ లెక్కన ఎన్టీఆర్‌కు – త్రివిక్రమ్‌కు గ్యాప్ అనుకోవడం.. భ్రమ లాంటిదే. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. మహేష్‌బాబుతో త్రివిక్రమ్ చేసే సినిమా తర్వాత అయినా మనం మరోసారి ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. అరవింద సమేతకు సీక్వెలో లేదా మరో త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ, ఎమోషన్స్ ఉన్న ఎంటర్టైనరో పడుతుంది.