టైటిల్: ఎఫ్ 3
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
ఎడిటింగ్: తమ్మిరాజు
మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు: దిల్ రాజు – శిరీష్ రెడ్డి
రచన : అనిల్ రావిపూడి
సెన్సార్ రిపోర్ట్: క్లీన్ యూ
రన్ టైం: 148 నిమిషాలు
రిలీజ్ డేట్: 27 మే, 2022
ఐదు వరుస హిట్లతో టాలీవుడ్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న అనిల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎఫ్ 2 టీం… అదే బ్యానర్.. దాదాపు అదే టీంతో సమ్మర్ సోగ్గాళ్లు ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఎఫ్ 3 .. ఎఫ్ 2 రేంజ్‌లోనే సక్సెస్ అయ్యిందో లేదో సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
వెంకీ (వెంకటేష్), వరుణ్ (వరుణ్ తేజ్) ఇద్దరు కూడా డబ్బు సంపాదించేందుకు ఎప్పుడూ అష్టకష్టాలు పడుతూ ఉంటారు. చాలా ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉంటారు. అయితే హారిక ( తమన్నా) కుటుంబం డబ్బు విషయంలో వీళ్లను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటుంది. ఓ బిజినెస్‌మేన్ ( మురళీశర్మ) తప్పిపోయిన తన కొడుకు కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పటికే ఇబ్బందుల్లో కూరుకుపోయిన వెంకీ, వరుణ్.. అటు తమన్నా ఫ్యామిలీ తామే ఆ వారసులం అని ఆ ఇంటికి వెళ్లి కోట్ల ఆస్తికి వారసులు కావాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ గేమ్‌లో ఏం జరిగింది ? ఎవరి జీవితాలు ? ఎలా మలుపులు తిరిగాయన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ :
సమ్మర్ సోగ్గాళ్లు అంటూ థియేటర్లకు వచ్చిన వీళ్లు బాగానే నవ్విస్తారు. వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను బాగా నవ్వించాడు. వెంకటేష్ కామెడీ టైమింగ్ సినిమాకే బాగా హైలెట్ అయ్యింది. వరుణ్ తేజ్‌తో వచ్చే సన్నివేశాలతో పాటు క్లైమాక్స్‌లో తనదైన కామెడీ యాంగిల్‌తో అదరగొట్టేశాడు. ఇక వరుణ్‌తేజ్ తన కామెడీతో సినిమాకు న్యాయం చేశాడు. తమన్నా, మెహ్రీన్ ఇద్దరూ గ్లామర్‌తో పాటు నటనతో ఆకట్టుకున్నారు. సోనాల్ చౌహాన్ ఎప్పటిలాగానే ఫుల్ గ్లామర్ డోస్‌తో కనిపించింది. పూజా హెగ్డే సాంగ్ ఓకే. ఇక రాజేంద్ర ప్రసాద్ – వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. మురళీశర్మ, అలీ, సత్య, సంపత్ రాజ్ లు కూడా తమ నటనతో మెప్పిస్తారు.
అనిల్ రావిపూడి ఎవరి టైమింగ్‌కు తగినట్టుగా వారి నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. ఇక అనిల్ కామెడీతో బాగా ఆకట్టుకున్నా కథ విషయంలో మాత్రం అనుకున్న స్థాయిలో వర్క్ చేయలేదు అనిపిస్తుంది. కథనంలో కూడా ఎక్కడా లాజిక్ లేకుండా సిల్లీ డ్రామాగా ముగుస్తుంది. సినిమాలో ఎమోషన్స్ పెద్దగా వర్కవుట్ కాలేదు. సినిమా ఫస్టాఫ్ ముగిసే వరకు కథపై ఓ అంచనాకు రాలేము.
ఫస్టాఫ్‌లో ఉన్న కామెడీ సెకండాఫ్‌లో అదే రేంజ్‌లో కంటిన్యూ చేయలేదు. సెకండాఫ్ స్టార్టింగ్ తర్వాత కొంత బోర్ కొట్టినట్టుగా ఉంటుంది. ఓవరాల్‌గా అయితే అనిల్ తనదైన ఫన్, ప్రస్టేషన్‌తో మరోసారి ఆకట్టుకున్నాడనే చెప్పాలి. టెక్నికల్‌గా చూస్తే అనిల్ రావిపూడి రచయితగా ఆకట్టుకున్నాడు. అయితే కథ, కథానాన్ని మరింత ఆసక్తికరంగా మలిచి ఉంటే ఇంకా సినిమా రేంజ్ వేరేగా ఉండేది.
దేవి మ్యూజిక్ పాటలు, వాటి పిక్చరైజేషన్ బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉన్న సెకండాఫ్ కొన్ని సీన్లను మరింత ట్రిమ్ చేస్తే బాగుండేది. దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా…
దర్శకుడు అనిల్ రావిపూడి ముందునుంచి అంచనాలు ఉన్నట్టుగానే ఎఫ్ 3లో కూడా తన కామెడీతో ఆకట్టుకున్నాడు. కథ, కథనాలను పక్కన పెట్టేసి కామెడీ పరంగా సినిమాను పిచ్చగా ఎంజాయ్ చేయవచ్చు. వెంకీ తన కామెడీ టైమింగ్‌తో సినిమాను మరో రేంజ్‌కు తీసుకువెళ్లాడు. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు కామెడీ ఇష్టపడే వాళ్లు చక్కగా ఎంజాయ్ చేసే సినిమా ఎఫ్ 3.
ఫైనల్ పంచ్ : ఎఫ్ 3 నవ్వులు.. పువ్వుల్
ఎఫ్ TL రేటింగ్ : 3 / 5