దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR తో బిగ్ హిట్‌ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సినిమాలో తన పాత్ర తక్కువుగా ఉన్నప్పటికి..తనకి ఇచ్చిన రోల్ కి పూర్తి న్యాయం చేసి..నూటికి నూరు మార్క్‌లు వేయించుకున్నాడు తారక్. ఇక ఈ సినిమా తరువాత తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివతో కమిట్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ని ఎప్పుడో అనౌన్స్ చేసారు. కానీ, సెట్స్ పైకి మాత్రం ఇంకా తీసుకెళ్లలేదు.
ఇక ఫైనల్ గా జూన్ మొదటివారంలో ఈ సినిమా పనులు లాంఛనంగా ప్రారంవ్హిస్తున్నారు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ కు ఇది 30వ చిత్రం కాగా.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. కాగా, ఈ సినిమా అనౌన్స్ చేసిన్నప్పతీ నుండి సినిమా లో హీరోయిన్ ఎవరా అంటూ బుర్ర బద్ధలు కొట్టుంటున్నారు జనాలు. కొన్నాళ్ళు జాన్వీ కపూర్ అంటూ నడిచిన మ్యాటర్ ..ఆ తరువాత బాలీవుడ్ బ్యూటీ అలియా పై వెళ్లింది. ఇక ఆమె కూడా తారక్ తో సినిమా చేస్తున్న అని ఓపెన్ గానే చెప్పుకొచ్చింది.
దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ సడెన్ గా ఈ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకుంటున్నట్లు ఆ ప్లేస్ లోకి రష్మిక వచ్చిన్నట్లు వార్తలు వినిపించాయి. మరో హీరోయిన్ గా సాయిపల్లవి కూడా ఫిక్స్ అయ్యిందంటూ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. అయితే, అలియా ఈ సినిమా నుండి తప్పుకోవడానికి కారణం స్టార్ డైరెక్టర్ రాజమౌళి అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. RRR సినిమాలో తన పాత్ర కట్ చేసారని అప్పట్లో అలియా అలిగి ఆ పోస్ట్‌లను కూడా డిలిట్ చేసింది.
ఇక ఆ తరువాత నుండి తెలుగు లో సినిమాలు చేయకూడదు అని డిసైడ్ అయ్యిందట. అంతేకాదు ఈ విషయాని ఆమె తన బాయ్ ఫ్రెండ్ కమ్ భర్త హీరో రణ్ బీర్ తో డైరెక్ట్ గా చెప్పేసిందట. అందుకే తారక్ సినిమా నుండి తప్పుకున్నట్లు ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది. దీని పై తారక్ ఫ్యాన్స్ కూడా స్పందిస్తూ..”ఇండస్ట్రీలో ఆమె ఒక్కటే హీరోయిన్ నా..చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు”,..అంటూ గట్టి కౌంటర్లు ఇస్తున్నారు .