టాలీవుడ్‌లో ఎంతోమంది నటవారసులు ఎంట్రీ ఇస్తున్నారు. వీరిలో కొందరు సక్సెస్ అవుతున్నారు. మరి కొందరు మాత్రం ఏ మాత్రం సక్సెస్ కాలేక తక్కువ టైంలోనే కెరీర్‌ను క్లోజ్ చేసుకుంటున్నారు. టాలీవుడ్‌లో అక్కినేని, ఘట్టమనేని ఫ్యామిలీల ప్రస్తానం ఏకంగా ఆరేడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. అక్కినేని ఫ్యామిలీలో ఏకంగా మూడో తరం హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చేశారు. ఇక ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా వచ్చిన మహేష్‌బాబు ప్రస్తుతం టాలీవుడ్ సూపర్‌స్టార్‌గా కంటిన్యూ అవుతున్నాడు. ఇక ప్రముఖ దర్శక, నిర్మాత జగపతి పిక్చర్స్ అధినేత విబి. రాజేంద్రప్రసాద్ తనయుడిగా జగపతిబాబు కూడా వెండితెరం గ్రేటం చేసి.. ఇప్పుడు విలన్‌గా, రకరకాల క్యారెక్టర్లు వేస్తూ తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు.
ఇక నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున, సూపర్‌స్టార్ కృష్ణ నటవారసుడిగా మహేష్‌కంటే ముందే హీరోగా వెండితెరం గ్రేటం చేసిన దివంగత రమేష్‌బాబు, జగపతిబాబు ఈ ముగ్గురి మధ్య ఓ కామన్ లింక్ ఉంది. ఈ ముగ్గురూ కూడా తెలుగు సినిమా వారసులే.. వీరు హిందీలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తూ హీరోలుగా పరిచయం అయ్యారు. ఇక ఈ మూడు సినిమాలకు కాకతాళీయంగా విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు.
ఇక నాగేశ్వరరావు నటించిన వెలుగు నీడలు, సుడిగుండాలు సినిమాల్లో బాల నటుడిగా నటించిన నాగార్జున 1986లో విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాతో హీరో అయ్యాడు. ఈ సినిమా ముందుగా హిందీలో జాకీ ష్రాఫ్, మీనాక్షి శేషాద్రి హీరో, హీరోయిన్లుగా సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమాకు రీమేక్‌గా విక్రమ్ వచ్చి సూపర్ హిట్ అయ్యింది.
ఇక సూపర్‌స్టార్ కృష్ణ నటించిన చాలా సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన రమేష్‌బాబును కృష్ణ పెద్ద హీరోగా చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే రమేష్‌బాబు 23 ఏళ్ల వయస్సులో సామ్రాట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే ఎన్టీఆర్ – కృష్ణ మధ్య మాటలు లేవు. ఈ సినిమా ముహూర్త సన్నివేశానికి ఏఎన్నార్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. హిందీలో సన్నీడియోల్ నటించిన సూపర్ హిట్ సినిమా బేతాబ్‌కు రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది.
ఈ సినిమాకు ముందుగా ఎస్‌వి. రాజేంద్ర సింగ్ బాబు ఓ షెడ్యూల్ డైరెక్ట్ చేశాడు. అయితే డబ్బు ఖర్చవుతున్నా షూటింగ్ ముందుకు సాగకపోవడంతో సీనియర్ దర్శకుడు మధుసూదన్ రావును డైరెక్టర్‌గా తీసుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత కూడా రమేష్‌బాబుకు బజార్ రౌడీ లాంటి హిట్స్ పడ్డాయి.
ఇక జగపతి పిక్చర్స్ అధినేత విబి. రాజేంద్ర ప్రసాద్ తనయుడు జగపతిబాబు తొలి సినిమాకు కూడా విక్టరీ మధుసూదన్ రావునే దర్శకుడిగా తీసుకున్నారు. హిందీలో వచ్చిన ఖత్రోం కే ఖిలాడి మూవీకి రీమేక్ గా సింహస్వప్నం మూవీగా తీశారు. ఈ సినిమాతో జగపతిబాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. జగపతిబాబు తండ్రిగా రెబల్‌స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర చేశారు. జగపతిబాబు డ్యూయెల్ రోల్ చేసిన ఈ సినిమా సరిగా ఆడలేదు.