టాలీవుడ్ మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా వస్తే అసలు మెగా ఫ్యాన్స్‌కు అది పెద్ద పండగే. మామూలు సినీ అభిమానులు కూడా వీరిద్దరు కలిసి స్క్రీన్ మీద మల్టీస్టారర్ చేస్తే మామూలు ఉత్కంఠతో ఉండరు. ఏ హీరోల అభిమానులు అయినా కూడా పవన్ – చిరు మల్టీస్టారర్ ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడతారు. అయితే పవన్ – చిరు కాంబినేషన్లో నిజంగా ఓ సినిమా రావాల్సి ఉంది. ఈ సినిమా తృటిలో మిస్ అయ్యింది.
చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలలో శంకర్‌దాదా ఎంబీబీఎస్ ఒకటి. బాలీవుడ్‌లో సంజయ్‌దత్ హీరోగా తెరకెక్కిన లగేరహే మున్నాబాయ్ సినిమా తెలుగు వెర్షన్ రీమేక్ శంకర్‌దాదా ఎంబీబీఎస్‌గా వచ్చింది. చిరంజీవి – సోనాలిబింద్రే జంటగా నటించారు. జయంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా చిరు ముఖ్యఅనుచరుడిగా కీలక పాత్రలో నటించారు.
సినిమాలో చిరు పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో సినిమాకే హైలెట్ అయిన ATM అనే పాత్ర కూడా ఉంది. ఈ పాత్రను శ్రీకాంత్ చేశాడు. ఈ పాత్రలో చేసినందుకు శ్రీకాంత్‌కు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ పాత్రను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సింది అట. ముందుగా చిరు, పవన్ కలిసి నటించాలనే అనుకున్నారట. డైరెక్టర్ కూడా అందుకు అనుగుణంగానే స్క్రిఫ్ట్ రెడీ చేసుకున్నాడట.
అయితే అప్పుడు పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో చిరు సినిమాకు డేట్లు ఎడ్జెస్ట్ చేయలేని స్థితిలో ఉండడంతో అప్పుడు చిరు స్వయంగా రికమెండ్ చేయడంతో ఈ ప్రాజెక్టులోకి శ్రీకాంత్ వచ్చాడు. చిరు సినిమాలో ఛాన్స్ రావడంతో శ్రీకాంత్ ఎగిరి గంతేయడంతో పాటు ఈ పాత్ర కోసం తన మేకోవర్‌ను సైతం మార్చుకున్నాడు.
ఈ క్రమంలోనే శ్రీకాంత్ చేసిన ATM పాత్రకు మంచిపేరు వచ్చింది. ఆ తర్వాత ఇదే సినిమాకు సీక్వెల్ అంటూ శంకర్‌దాదా జిందాబాద్ సినిమా వచ్చి డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాలో కరిష్మా కొటక్ హీరోయిన్‌గా నటించింది.