ఒకప్పుడు సినిమాల్లో బాలనటులుగా నటించిన వాళ్లు ఆ తర్వాత హీరోలు, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. సినిమా రంగంలో ఉన్న ఫ్యామిలీ అయితే సహజంగానే తమ వారసులను సినిమాల్లోకి తీసుకువచ్చేస్తుంది. అలా కాకుండా చిన్నప్పుడు అనుకోకుండా బాలనటులుగా చేసిన వారు పెద్దయ్యాక కూడా అదే ఇంట్రస్ట్‌తో సినిమాల్లోకి వచ్చి హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. చిన్నప్పుడు బాలనటుడిగా చేసిన యంగ్ హీరో తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్లందరూ కూడా బాల నటులుగా చేసి ఇప్పుడు సూపర్స్టార్లు అయిన వాళ్లే. ఇక చిన్నప్పుడు ఓ బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించిన ఓ బాలనటి ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఈ తరం జనరేషన్‌కు తెలియకపోవచ్చు కాని… 20 ఏళ్ల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో దేవుళ్లు సినిమా వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎగ్జిబిటర్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు నిర్మించిన ఈ సినిమాలో రాశి, పృథ్వి భార్య, భర్తలుగా నటించారు.
విడిపోయిన ఈ జంటను కలిపేందుకు వీరి పిల్లలు పడిన కష్టాలు, దేవుళ్లను ప్రార్థించిన తీరు ఆ ఎమోషనల్‌కు నాటి తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ కావడంతో పాటు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నటించిన బాల నటి నిత్యా శెట్టి తన నటనకు గాను ఏకంగా నంది అవార్డు తెచ్చుకుంది.
అలాగే చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్ తోనూ నిత్యాశెట్టి ఎంతో మందిని ఆకట్టుకుంది. అప్పట్లో ఈ పిల్ల నటన గురించే ప్రతి తెలుగు ఇంట్లోనూ చర్చించుకునే వారు. అయితే నిత్యాశెట్టి తెలుగు అమ్మాయి కాదు తమిళ పిల్ల. బాలనటిగా కొన్ని సినిమాలు చేశాక నిత్య ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఉన్నత చదువులు పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తోంది. అటు ఉద్యోగంతో పాటు ఇటు మోడలింగ్ కూడా కంటిన్యూ చేసింది.
తెలుగులో చాలా రోజుల తర్వాత 2015లో రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో నటించిన దాగుడు మూతలు దండాకోర్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అదే యేడాది తమిళ్లో కూడా మరో సినిమా చేసింది. అలాగే పడేశావే సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం నిత్యాశెట్టి నిహారిక నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె బ్యాక్ టు బ్యాక్ అందాలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూస్తుంటే దేవుళ్లు పిల్లేనే ఇప్పుడు ఇంత అందంగా ఉంది అనిపించేలా ఉంది.