నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ తరం జనరేషన్ హీరోల్లో చాలా స్పెషల్. జానపదం, లవ్, సోషల్, పౌరాణికం, సోషియో ఫాంటసీ ఇలా ఏదైనా ఆయనకు కొట్టిన పిండే. ఇప్పుడున్న హీరోల్లో అసలు బాలయ్యకు పోటీ ఇచ్చే హీరోయే ఎవ్వరూ ఉండరు. నటరత్న నందమూరి తారక రామారావు వారుడిగా వెండితెరకు తాతమ్మకల సినిమాతో బాలయ్య ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు ఎన్టీఆర్ దర్శకుడు. 1974లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాలయ్యకు తొలి సినిమా. నిజ జీవితంలో అన్నదమ్ములు అయిన బాలయ్య – హరికృష్ణ రీల్ లైఫ్ అన్నదమ్ములుగా కూడా నటించారు.
అనురాగ దేవత :
ఎన్టీఆర్ – జయసుధ- శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాలయ్యకు పదో సినిమా. బాలీవుడ్‌లో వచ్చిన ఆషా సినిమా ఆధారంగా చేసుకుని అనురాగ దేవత తెరకెక్కించారు. 1982లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. బాలయ్య – ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్లు నాడు ప్రేక్షకులను ఎంతో మెప్పించాయి.
బాబాయ్ – అబ్బాయ్ :
సాహసమే జీవితం అనే సినిమాతో బాలయ్య సోలో హీరోగా మారాడు. 1984లో ఇది విడుదల అయ్యింది. ఆ యేడాది బాలయ్య హీరోగా చేసిన ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆయన నటించిన 20వ సినిమా బాబాయ్ – అబ్బాయ్. జంధ్యాల ఈ సినిమాకు దర్శకుడు. బాలయ్య – సుత్తివేలు నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
నిప్పులాంటి మనిషి :
బాలీవుడ్‌లో వచ్చిన ఖయామత్ సినిమాకు రీమేక్‌గా నిప్పులాంటి మనిషి వచ్చింది. ఎస్‌బి. చక్రవర్తి దర్శకత్వం వహించన ఈ యాక్షన్ సినిమాలో రాధ హీరోయిన్. శరత్‌బాబు కీలక పాత్రల్లో నటించారు. 1986లో రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య 25వ సినిమా.
కలియుగ కృష్ణుడు :
పరుచూరి బ్రదర్స్ రచనలో మురళీమోహన్ రావు డైరెక్ట్ చేసిన సినిమా ఇది. బాలయ్య – రాధ జంటగా రావుగోపాలరావు, శారద, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో బాలయ్య డైలాగులు హైలెట్. ఇది బాలయ్య 30వ సినిమా.
దొంగ రాముడు :
కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన యాక్షన్ సినిమా ఇది. 1988లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో ఓ మైలురాయి. బాలయ్య – రాధ జంటగా నటించారు. మోహన్‌బాబు ప్రతి నాయకుడిగా నటించాడు.
నారి నారి నడుమ మురారి :
కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శోభన, నిరోషా హీరోయిన్లు. 1990లో రిలీజ్ అయ్యింది. శారత బాలయ్యకు అత్తగా చేసింది. ఒక్క ఫైట్ లేకుండా సూపర్ హిట్ అయిన బాలయ్య సినిమా ఇదే. ఇది బాలయ్య 50వ సినిమా.
బంగారు బుల్లోడు :
రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్. రవీనా టాండన్, రమ్యకృష్ణ హీరోయిన్లు. 1993లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజే కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన నిప్పురవ్వ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా 100 రోజులు ఆడింది. ఇది బాలయ్య కెరీర్‌లో 60వ సినిమా.
దేవుడు :
బంగారు బుల్లోడు తర్వాత రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలోనే వచ్చిన సినిమా దేవుడు. 1997లో రిలీజ్ అయిన ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్. బాలయ్య కెరీర్‌లో 70వ సినిమాగా వచ్చిన దేవుడు ప్లాప్.
కృష్ణబాబు :
సమరసింహారెడ్డి, సుల్తాన్ తర్వాత బాలయ్య చేసిన సినిమా ఇది. ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. మీనా హీరోయిన్. బాలయ్య కెరీర్‌లో ఇది 75వ సినిమా. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
సీమసింహం :
బాలయ్య కెరీర్‌లో 80వ సినిమాగా వచ్చిన సీమసింహంకు ఆయన ప్రియమైన పొటోగ్రాఫర్ సీ రాం ప్రసాద్ దర్శకుడు. సిమ్రాన్, రీమాసేన్ హీరోయిన్లు. ఈ సినిమా అంచనాలు అందుకోలేదు.
మిత్రుడు :
ప్రియమణి – బాలయ్య జంటగా నటించిన ఈ సినిమాకు రాజమౌళి శిష్యుడు మహదేవ్ దర్శకుడు. బాలయ్య కెరీర్‌లో ఇది 90వ సినిమా. ఈ సినిమా ప్లాప్.
గౌతమీపుత్ర శాతకర్ణి :
బాలయ్య కెరీర్‌లో 100వ సినిమాగా వచ్చిన ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో పోటీ పడి మరీ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్. శ్రియ బాలయ్యకు జోడీగా నటించింది. శాతవాహన చక్రవర్తిగా బాలయ్య నటన అమేజింగ్.