Lifestyleఅమ్మాయిల‌ను ప‌డేసేందుకు అబ్బాయిలు చెప్పే మాట‌లు ఇవే...!

అమ్మాయిల‌ను ప‌డేసేందుకు అబ్బాయిలు చెప్పే మాట‌లు ఇవే…!

కుర్ర ఏజ్‌లో అమ్మాయిల‌ను ఎట్రాక్ట్ చేసేందుకు అబ్బాయిలు చాలా రిస్క్‌లు చేస్తూ ఉంటారు. ఇందుకోసం వారు వేయ‌ని ఎత్తులు ఉండ‌వు. ఆ వ‌య‌స్సు ప్ర‌భావం అలాంటివి.. మ‌రి కొంద‌రు చేత‌ల‌తో పాటు మాట‌ల‌తోనే అమ్మాయిల‌ను లైన్లో పెట్టేసుకుంటారు. అయితే మామూలు మాట‌ల‌కు అమ్మాయిలు ఇంప్రెస్ కారు.. ఎలాంటి మాట‌లు చెపితే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారు అనేదానిపై అబ్బాయిలు కాస్త గ‌ట్టిగానే రీసెర్చ్ చేస్తార‌ట‌.

చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల‌ను ప‌డేసే క్ర‌మంలో ఈ కింద మాట‌లే చెపుతార‌ట‌. అమ్మాయిల‌ను ప‌డేసేందుకు అబ్బాయిలు చెప్పే ఆ మాట‌లు ఏంటో ఓ సారి చూద్దాం. అమ్మాయిల‌ను ప‌డేసేందుకు త‌న‌తో సీరియ‌స్‌గా రిలేష‌న్ కంటిన్యూ చేయాల‌ని అనుకుంటున్నాన‌ని చెప్పేస్తార‌ట‌. అందులో నిజం ఉన్నా లేక‌పోయినా నేను నీతో సీరియ‌స్‌గానే బంధాన్ని కోరుకుంటున్నాను అని చెప్ప‌డంతోనే ఆమెను ఇంప్రెస్ చేసే ప్లాన్‌కు పునాది వేసుకుంటార‌ట‌.

ఇక తాను ప్రేమించే అమ్మాయి మీద న‌మ్మ‌కం ఉన్నా లేక అనుమానం ఉన్నా కూడా నేను నిన్ను న‌మ్ముతున్నాను.. నీ ప్రేమ మీద న‌మ్మ‌కం ఉంద‌ని ప‌దే ప‌దే చెపుతూ ఉంటార‌ట‌. నాకు వంట చేయ‌డం బాగా వ‌చ్చు.. నీకు న‌చ్చిన ఫుడ్ వండి పెడ‌తాను.. నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్ట‌ను.. నీ క‌ళ్ల‌ల్లో నీళ్లు రాకుండా చూసుకుంటాను అని చెపుతూ ఆమెను లైన్లో పెట్టేందుకు ట్రై చేస్తార‌ట‌. ఎందుకంటే…
వంట చేసే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట.

ఇక నీ కోసం నేను ఏం చేయాల‌ని అనుకుంటున్నావో చెపితే.. నువ్వు అస్స‌లు న‌మ్మ‌వు తెలుసా.. అన్న ఈ డైలాగ్ కూడా త‌ర‌చూ చెపుతూ ఉంటార‌ట‌. నువ్వు ఎలా ఉన్నావు అన్న‌ది నాకు అవ‌స‌రం లేదు.. నువ్వు నాకు ఎప్పుడూ అందంగానే క‌న‌ప‌డ‌తావు అని చెపుతూ ఉంటార‌ట‌. నేను నీతో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఎంతో ఆనందంగా.. ఉత్సాహంగా ఉంటాను అని కూడా చెపుతూ ఉంటార‌ట‌.

ఇక ఫైన‌ల్‌గా నువ్వు లేని జీవితాన్ని నేను అస్స‌లు ఊహించుకోలేను.. ఎప్ప‌టికైనా నీతోనే నా జీవితం లాంటి మాట‌లు అమ్మాయిల‌పై బాగా ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ట‌. ఇక పెళ్లి అయ్యాక కూడా అమ్మాయిలు పెళ్లికి ముందు త‌మ‌పై అబ్బాయిలు చూపించిన ఆ ఇంప్రెస్ ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోరట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news