నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గత దశాబ్ద కాలంగా కెరీర్ను పరిశీలిస్తే ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. అఖండ సినిమాను టిక్కెట్ రేట్లు తక్కువుగా ఉన్నా.. డేర్ చేసి రిలీజ్ చేసి కూడా బ్లాక్బస్టర్ కొట్టడంతో అందరి మతులు పోయాయి. డిసెంబర్ 2న ప్రారంభమైన అఖండ గర్జన 175 రోజులు అవుతున్నా ఇంకా ఒక చోట కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు 2 వ వారం పోస్టర్ చూడడం గగనమవుతోన్న రోజుల్లో 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
అఖండ 175 రోజులు ఆడడంతో ఓ అదిరిపోయే రికార్డు అఖండ సొంతమైంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహా – లెజెండ్ – అఖండ మూడు సినిమాలు 175 రోజులు ఆడాయి. ఒక హీరో, ఒక డైరెక్టర్ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు హిట్ అవ్వడంతో పాటు మూడు సిల్వర్ జూబ్లి ఆడడం అంటే మామూలు విషయం కాదు. అఖండ చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 175 రోజులు ఆడి.. ఇంకా కంటిన్యూ అవుతోంది.
ఇక బాలయ్య కెరీర్లో అసలు ఎన్ని 175 రోజుల సినిమాలు వచ్చాయో తెలుసుకుంటే ఆశ్చర్యమే. బాలయ్య కెరీర్లో 365 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్టయ్య సినిమాలు అయితే హైదరాబాద్లోనే ఏకంగా 3 థియేటర్లలో 365, 175 రోజులు ఆడాయి. ఇది మామూలు రికార్డు కాదు. లెజెండ్ అయితే కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మినీ శివ థియేటర్లో ఏకంగా 1000 రోజులు ఆడింది.
ఇక గతంలోనూ బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్ణయ్యతో పాటు సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లక్ష్మీ నరసింహా, భైరవద్వీపం, ఆదిత్య 369, రౌడీఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, మంగమ్మగారి మనవడు, శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలు కూడా థియేటర్లలో 175 రోజులు ప్రదర్శింపబడ్డాయి. ఇక షిఫ్టులతో 175 రోజులు ఆడిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.
ఇలాంటి అరుదైన రికార్డులు టాలీవుడ్లో తక్కువ మంది హీరోలకు మాత్రమే సొంతమైంది. అందులో బాలయ్య కూడా ఒకరు. ఒకే సినిమా.. ఒకే కేంద్రంలో సంవత్సరం పాటు ఆడడం అంటే మామూలు విషయం కాదు. ఇక బాలయ్య ప్రస్తుతం మలినేనీ గోపీచంద్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ డైరెక్టర్లు హిట్లతో ఫుల్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే.