టాలీవుడ్ స్టార్ హీరో మహేష్‌బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం కమర్షియల్‌గా హిట్ అయిపోతుందనే అంటున్నారు. ఓవర్సీస్‌లో ఫస్ట్ డేకే ఏకంగా 1.1 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. మహేష్‌బాబుకు యూత్, లేడీస్… ఓల్డేజ్ ఇలా అన్ని వర్గాల్లోనూ అభిమానులు ఉన్నారు. మహేష్ ఎప్పుడూ తన బాడీ లాంగ్వేజ్‌కు సూట్ అయ్యే కథలను మాత్రమే చేస్తూ ఉంటాడు.
ఒకే కథను ఎక్కువ సార్లు వినడం… వాటికి దగ్గరుండి రిపేర్లు చేయడం… ఓ సారి సినిమా చేస్తానని చెప్పాక పదే పదే కథలో దూరి వేళ్లు పెట్టి కెలికేయడాలు మహేష్‌కు తెలియని పని. కథకు ఓకే చెప్పాక డైరెక్టర్ ఏది చెపితే అదే మహేష్ చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఏదేమైనా ఓ కథ విషయంలో డైరెక్టర్లను నాన్చకుండా.. పదే పదే తన చుట్టూ తిప్పించుకోకుండా వెంటనే ఓకే చెప్పేస్తాడు.
అయితే మహేష్ తన బాడీ లాంగ్వేజ్‌కు సెట్ కావనో.. లేదా మరో ప్రాజెక్టులో బిజీగా ఉండో చాలా హిట్ సినిమాలు వదులుకున్నాడు. అలా వదులుకున్న కొన్ని సినిమాలను మనం చూద్దాం.
పుష్ప :
మహేష్ వదులుకున్న అతి పెద్ద రీసెంట్ బ్లాక్‌బస్టర్ పుష్ప. పుష్ప సినిమా చూసిన వారు ఎవరైనా మహేష్ బాడీ లాంగ్వేజ్‌కు సెట్‌కాదనే చెపుతారు. సుకుమార్ ఈ కథ చెప్పి మహేష్‌ను చేయమని ఎంత చెప్పినా సున్నితంగా తిరస్కరించాడు. అయితే సుకుమార్ వన్ సినిమా దెబ్బకు కూడా మహేష్‌కు భయం పట్టుకోవడంతో ఈ సినిమా వదులుకోవడానికి మరో కారణం అంటారు.
వర్షం :
ప్రభాస్‌కు తిరుగులేని స్టార్ డమ్ ఇచ్చిన సినిమా వర్షం. ఈ కథ ముందుగా మహేష్‌బాబు దగ్గరకే వచ్చింది. అయితే ఆ పాత్ర తనకు కనెక్ట్ కాదని మహేష్ వదిలేశాడు. మాస్, యాక్షన్ ఎక్కువుగా ఉందనే అప్పుడు మహేష్ ఈ సినిమా రిజెక్ట్ చేశాడు.
గజని :
మురుగదాస్ అంటే మహేష్‌కు ఎంతో ఇష్టం. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథ ఆయన చాలా మంది హీరోలకు చెప్పాడు. ఈ లిస్టులో మహేష్ కూడా ఉన్నాడు. అయితే ప్రేక్షకులు, తన అభిమానులు తనను గ్లామర్‌గా మాత్రమే చూడడానికి ఇష్టపడతారు అని.. ఈ గుండు ప్రయోగం చేయలేని నో చెప్పేశాడు.
లీడర్ :
శేఖర్ కమ్ముల లీడర్ సినిమా కథ ముందు మహేష్‌కే చెప్పాడు. అయితే ఆ పొలిటికల్ స్టోరీ తనకు సెట్ కాదని ఒప్పుకోలేదు. చివరకు ఆ సినిమా రానా దగ్గరకు వెళ్లింది. అలాగే నాగచైతన్య డెబ్యూ మూవీ ఏ మాయ చేశావే, నితిన్ అ ఆ సినిమాల కథలు కూడా ముందు మహేష్ దగ్గరకే వెళ్లాయి. మహేష్ ఒప్పుకోకపోవడంతో బ్లాక్‌బస్టర్లు మిస్ అయ్యాడు.