నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మకల సినిమాతో స్టార్ట్ అయ్యింది. అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా కూడా బాలయ్యకు ఫస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ సినిమా మాత్రం కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమాయే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్. ఈ సినిమా 365 రోజుల పాటు ఆడి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
సుహాసిని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో భానుమతి నాయనమ్మగా నటించింది. ఈ సినిమా సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. 1984సెప్టెంబర్ 7న రిలీజైన ఈ సినిమాకు దాదాపు అరడజను సినిమాలు పోటీకి వచ్చాయి. అదేరోజు అందాల నటుడు శోభన్ బాబు అభిమన్యుడు సినిమా కూడా థియేటర్లలోకి వచ్చింది. ఇక విజయశాంతి – రాధిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్ట్ చేశారు.
కమర్షియల్‌గా సక్సెస్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యబో యావరేజ్ అయ్యింది. ఈ సినిమాకు వారం రోజుల ముందుగా సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ఉద్దండుడు సినిమా రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది.
మంగమ్మగారి మనవడు సినిమాకు ఒక్క రోజు ముందే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంటిగుట్టు రిలీజ్ అయ్యింది. అప్పటికే చిరుకు ఖైదీ లాంటి బ్లాక్బస్టర్ సినిమా ఉండడంతో ఇంటిగుట్టుకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కె. బాపయ్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సుహాసిని హీరోయిన్. ఈ సినిమా కమర్షియల్‌గా ప్లాప్ అయ్యింది.
ఇక మంగమ్మగారి మనవడు సినిమాకు 13రోజుల గ్యాప్‌తో అక్కినేని నాగేశ్వరరావు డ్యూయల్ రోల్ చేసిన జస్టిస్ చక్రవర్తి రిలీజ్ అయ్యింది. ఏఎన్నార్ జస్టిస్, లాయర్ పాత్రల్లో నటించిన ఈ సినిమాను కూడా దాసరియే డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కమర్షియల్‌గా యావరేజ్ అయ్యింది. అలాగే మంగమ్మగారి మనవడు సినిమాకు రెండు వారాల గ్యాప్‌తో సుమన్ – శివకృష్ణ – భానుప్రియ ఎదురులేని మొనగాళ్లు రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఆరు సినిమాల పోటీలో వచ్చినా కూడా మంగమ్మగారి మనవడు తిరుగులేని బ్లాక్‌బస్టర్ అవ్వడంతో పాటు ఏకంగా యేడాది పాటు నిలిచి బాలయ్యను తిరుగులేని స్టార్‌ను చేసింది.