మాస్ మహరాజ్ రవితేజ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఈ రోజు స్టార్ హీరో అయ్యాడు. ఇండస్ట్రీలో రాణించాలన్న కోరికతో ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రవితేజ కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. రవితేజ కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. కనీసం ఓ పూట తినేందుకు తిండికూడా లేదు.
ఆ తర్వాత వెండితెర మీద నటుడిగా ఎంట్రీ ఇచ్చినా ముందు చిన్నా చితకా పాత్రలు చేసుకున్నాడు. సింధూరం లాంటి సినిమాలో చిన్నా చితకా పాత్రలు వేసుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి అన్నయ్య సినిమాలో ఆయనకు తమ్ముడిగా నటించాడు. తర్వాత ఉషాకిరణ్ మూవీస్ నీకోసం సినిమా చేశాడు. అయితే రవితేజకు పూరి జగన్నాథ్ ముందుగా బ్రేక్ ఇచ్చాడు.
ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా హిట్ అవ్వడం.. అదే టైంలో వంశీ అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. రెండు సినిమాలు వచ్చి రెండు హిట్ అయ్యాయి. ఆ తర్వాత వరుసగా పూరి రవితేజతో ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు చేశాడు. రెండు హిట్ అయ్యాయి. ఆ తర్వాత రవితేజ ఇక వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
అమీర్‌పేట సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన అశ్విని రవితేజ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె రాజా ది గ్రేట్ సినిమాలో సాంగ్‌లో కూడా కనిపించింది. ఆ సినిమా షూటింగ్ విశేషాలు మీడియాతో పంచుకునే క్రమంలోనే ఆమె రవితేజ కెరీర్‌లో పడిన కష్టాలను వివరించింది. రవితేజ కేవలం రు. 10తో రోజంతా ఎలా ?గడిపాడో తన దగ్గర ప్రస్తావించాడని అశ్విని చెప్పింది.
మధ్యాహ్నం పనిలో పడితే అసలు ఆకలి అనేదే తెలిసేది కాదని.. రాత్రి వేళల్లో నిద్ర రావాలంటే కడుపు నిండాల్సిందే అని.. అందుకే పగలు పస్తులు ఉండి.. దాచుకుని రాత్రికి తినేసి పడుకునే వాడిని అని రవితేజ చెప్పారని అశ్విని తెలిపింది. ఇక ఎంత పెద్ద స్టార్ అయినా కెరీర్ స్టార్టింగ్‌లో కష్టాలు తప్పవని ఆమె పేర్కొన్నారు.