బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మహేష్‌భట్ కుమార్తె పూజా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తండ్రి వారసత్వం నుంచే వచ్చిన పూజా భట్ రెండున్నర దశాబ్దాల క్రిందట స్టార్ హీరోలతో నటించి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా భట్ సంచలన విషయాలు చెప్పింది. పూజా ఈ వయస్సులో కూడా రొమాన్స్, బోల్డ్ విషయాలు బయట పెట్టడంలో ఏ మాత్రం సందేహించదు.
తాను 12 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే భాయ్ ఫ్రెండ్ ఉన్నాడని… తాము 12 ఏళ్ల నుంచే ప్రేమలో ఉండగా… తమ డేటింగ్ 16 ఏళ్ల వయస్సుకు పీక్స్‌కు చేరుకుందని చెప్పింది. అదే టైంలో ఆమెకు ఆషీకి ఆఫర్ వచ్చిందట. తాను ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తితో ఉన్నా తన భాయ్ ఫ్రెండ్ మాత్రం తర్వాత సినిమాలు మానేయాలని పట్టుబట్టడంతో తాను ఆషీకి ఆఫర్‌ను వదులుకున్నట్టు చెప్పింది.
మహేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది. ఈ సినిమాలో ఫస్ట్ ఛాన్స్ పూజా భట్‌కే వచ్చింది. అయితే ఆమె భాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలనుకుంటే సినిమాల్లో మానేయాలన్న కండీషన్ పెట్టడంతో అయిష్టంగానే పూజా ఈ ఛాన్స్ వదులుకుంది.
పూజా తప్పుకోవడంతో చివరకు ఆషీకిలో అను అగర్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. తాను తన భాయ్ ఫ్రెండ్ కోరికను గౌరవించే ఈ సినిమా చేయలేదని.. ఆ తర్వాత తనకు భాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయ్యిందని చెప్పింది. ఇప్పటకీ తాను ఆషికి సినిమాను ఎందుకు ? మిస్ చేసుకున్నానా ? అని బాధపడుతూ ఉంటానని చెప్పింది. ఆషికి ఆల్ టైం బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
View this post on Instagram