పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ బద్రి సినిమా. 2000 సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. పవన్ స్టైల్ అంటే యూత్ పడిచచ్చిపోయేలా బద్రి యూత్‌లోకి చొచ్చుకుపోయింది. నువ్వు నంద అయితే నేను బద్రి.. బద్రినాథ్ అంటే చెప్పే డైలాగ్.. పవన్ మేనరిజమ్స్ అన్ని సరికొత్తగా ఆవిష్కరించాయి. అన్నింటికి మించి ఈ సినిమాలో తన పక్కన హీరోయిన్‌గా చేసిన రేణుదేశాయ్ తర్వాత పవన్ నిజజీవిత భాగస్వామి అయ్యింది.
బద్రి 45 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. పవన్ ముందుగా రేణుదేశాయ్‌ను ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఆమెతో పందెం వేసి అమీషా పటేల్‌ను పడగొడతానని చెప్పి నిజంగానే ఆమెతో ప్రేమలో పడతాడు. ఇది సినిమా స్టోరీ. అయితే ఈ సినిమా కథ చెప్పేందుకు పూరి పవన్‌ను ఎలా కలవాలా ? అని చాలా ఆలోచనలు చేసి చేసి శ్యామ్ కె.నాయుడు సాయం తీసుకుని పవన్‌కు క్లోజ్ అయిన ఆయన సోదరుడు చోటా కె. నాయుడు ద్వారా పవన్‌ను కలవాలని అనుకున్నాడు.
అయితే చోటా ముందు ఆ కథ తనకు చెప్పాలని కండిషన్ పెట్టాడు. అయితే బద్రి కథ చోటాకు చెప్పేందుకు ఇష్టం లేని పూరి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పాడు. ఆ కథ నచ్చిన చోటా పవన్ అపాయింట్‌మెంట్ తీసుకుని కథ చెప్పడానికి వెళ్లాడు. అయితే పవన్ 30 నిమిషాల టైం ఇవ్వగా ఇది చెప్పేందుకు చాలా టైం పడుతుందని పూరి గొణిగాడు. అయితే పవన్ నాకు టైం లేదన్నట్టుగా సైగ చేశాడట.
వెంటనే పూరి ముందు 2 నిమిషాల టైం తీసుకుని ఓ అమ్మాయి.. అబ్బాయి ప్రేమలో ఉంటారు. ఆ అమ్మాయి అతడితో పందెం వేసి మరో అమ్మాయిన ప్రేమించేలా చేస్తుందని చెప్పడంతో పవన్ వెంటనే క్లైమాక్స్ ఏంటని అడిగి.. క్లైమాక్స్ మార్చమని అడిగాడట. అయితే పూరి తర్జనభర్జనల తర్వాత పూరి తాను అనుకున్న క్లైమాక్సే ఉంచాడు. చివరకు పవన్ కూడా ఓకే అన్నాడు. అంతకుముందే పవన్‌కు విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ అధినేత టి. త్రివిక్రమ రావు పవన్‌కు అడ్వాన్స్ ఇచ్చి ఉండడంతో ఆ బ్యానర్లో బద్రి తెరకెక్కింది.
అయితే ఇదే కథను నాగార్జునతో తీయాలని పూరి ముందుగా అనుకున్నాడు. నాగ్ ఇమేజ్‌కు ఈ కథ బాగా సూట్ అవుతుందని భావించాడు. అయితే ముందుగా అనుకున్న కథలు మారి.. హీరోలు మారి చివరకు పవన్ చెంత చేరింది. అలా పవన్ ఖాతాలో హిట్ పడడంతో పాటు పూరి జగన్నాథ్ ఫస్ట్ సినిమాయే సూపర్ హిట్ అయ్యింది.