టాలీవుడ్‌లో యంగ్ జనరేషన్ దర్శకులలో దూసుకు పోతున్నాడు పరశురాం. యువత – ఆంజనేయులు – సోలో – గీతగోవిందం లాంటి సక్సెస్ ఫుల్, డిఫరెంట్ సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. గీతగోవిందం సినిమా చూసిన టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా పరశురాంతో ఎలాగైనా ఒక్క సినిమా అయినా చేయాలని డిసైడ్ అయిపోయారు. అయితే మహేష్ ముందుగానే పరశురాంకు ఆ ఛాన్స్ ఇచ్చేశాడు. అయితే గీతగోవిందం తర్వాత మహేష్‌తో వర్క్ చేసేందుకు పరశురాంకు ఏకంగా నాలుగేళ్లు పట్టింది.
కరోనాతో రెండేళ్ల పాటు సర్కారు వారి పాట షూటింగ్ ముందుకు కదల్లేదు. ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడి ఎట్టకేలకు ఈ నెల 12న థియేటర్లలోకి వస్తోంది. మహేష్ ఓ వైపు ప్రమోషన్లను హోరెత్తిస్తున్నాడు. అటు పరశురాం కూడా మహేష్‌తో కలిసి ఈ సినిమా గురించి పలు ఇంట్రస్టింగ్ విషయాలు మీడియాతో పంచుకుంటున్నాడు.
పూరి జగన్నాథ్‌కు కజిన్ అయిన పరశురాం ఆ తర్వాత గీతా ఆర్ట్స్‌లో పనిచేశాడు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్‌తో పరశురాం తెరకెక్కించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత గీతగోవిందం బ్లాక్‌బస్టర్ కొట్టింది. సినిమాకు ప్రి రిలీజ్ బజ్ చాలా పాజిటివ్‌గా ఉండడంతో మహేష్ అభిమానులు మామూలు ఖుషీగా లేరు.
త్రిబుల్ ఆర్ తర్వాత ఆ రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లు జరుగుతోన్న సినిమా సర్కారు వారి పాట. పైగా ఈ సినిమాకు తొలి పది రోజుల పాటు అదనపు షోలు వేసుకునేందుకు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. ఏపీలో రు. 45, తెలంగాణలో రు. 50 పెంచుకునే వెసులు బాట్లు ప్రభుత్వం ఇవ్వడంతో ఓపెనింగ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు పరశురాం ఫస్ట్ చాయిస్ మహేష్‌బాబు కాదట. తనకు గీతా కాంపౌండ్ ఎంతో సాయం చేసింది.
ఈ సినిమాను బన్నీ హీరోగా గీతా కాంపౌండ్‌లో చేయాలని పరశురాం అనుకున్నాడు. అయితే బన్నీ పుష్పకు ఓకే చెప్పడంతో ఈ కథ మహేష్‌కు వెళ్లింది. ఈ కథకు పాన్ ఇండియా అప్పీల్ లేదని భావించిన బన్నీ పుష్ప వైపే మొగ్గు చూపాడు. చివరకు పరశురాం మహేష్ కోసమే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ – 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఏదేమైనా సినిమా ప్రి రిలీజ్ టాక్ బట్టి బన్నీ ఓ బ్లాక్‌బస్టర్ మిస్ అయ్యాడని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.