ఇండస్ట్రీలో ఒక్కో కాంబినేషన్ సెట్ అవ్వడం వెనక చాలా తతంగాలే నడుస్తుంటాయి. అసలు ఓ డైరెక్టర్ ఓ హీరోకు కథ చెప్పడానికి చాలా లింక్‌లు ఉంటాయి. మరీ పెద్ద స్టార్ డైరెక్టర్ అయితే తప్పా.. మీడియం రేంజ్ దర్శకులను స్టార్ హీరోలు అంత సులువుగా తమ దగ్గరకు రానివ్వరు. ఓ మీడియం రేంజ్ డైరెక్టర్‌కు నేరుగా స్టార్ హీరో దగ్గరకు వెళ్లి కథ చెప్పేంత సీన్ ఉండదు. ఎవరో ఒకరిద్దరు విషయంలో వదిలేస్తే చాలా ఈక్వేషన్లు, లెక్కలు ఉంటాయి.
కొందరు హీరో కథ వినేందుకు రికమెండేషన్లు కూడా చేస్తుంటారు. కథ సెట్ అయ్యి.. అది సినిమాగా రూపాంతరం చెందితే మధ్యలో లైన్ కలిపిన వాళ్లు కమీషన్లు కూడా తీసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ పెద్ద సినిమా వచ్చింది. సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా కూడా వసూళ్లు జస్ట్ ఓకే అన్నట్టుగానే ఉన్నాయి. ఇంకా బ్రేక్ ఈవెన్‌కు అయితే రాలేదు. సినిమాకు వచ్చిన టాక్‌తో పోలిస్తే వసూళ్లు బాగున్నా.. రిపీటెడ్ ఆడియెన్స్ వచ్చే స్కోప్ తక్కువుగా ఉండడంతో బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంది.
ఇక లాభాలు కూడా వస్తే తక్కువుగా రావడం.. లేకపోతే లేదు అన్నట్టుగా ఉంది ఆ సినిమా వ్యవహారం. అయితే ఈ సినిమా కథను సదరు స్టార్ హీరో దగ్గరకు తీసుకు వెళ్లేలా చేసేందుకు మొన్నామధ్య ఓ పెద్ద డిజాస్టర్ సినిమా తీసిన దర్శకుడే సాయం చేశాడు. సదరు డైరెక్టర్ ఆ స్టార్ హీరోకు గతంలో మంచి హిట్లు ఇచ్చి ఉండడంతో ఆ యాక్సెస్‌తో ఈ కథ వినమని.. బాగుందని చెప్పడంతో హీరోగారు విని ఓకే చేసి సినిమా చేసేశారు.
అయితే సదరు మధ్యవర్తి డైరెక్టర్ చెప్పాడనే ఆ హీరో గారు సినిమా చేశారు.. ఇప్పుడు ఆయన అంచనాలకు కూడా ఎక్కడో అందలేదు. దీంతో ఆయన మధ్యవర్తిగా ఉన్న స్టార్ డైరెక్టర్‌పై అసహనం వ్యక్తం చేశాడట. నేను వేరే ప్రాజెక్టు చేద్దామని అనుకుంటే నువ్వే కదా ఈ ప్రాజెక్టు అంటూ తీసుకువచ్చావ్.. నా వరుస హిట్ల పరంపర స్థాయికి తగ్గ సినిమా ఇది కాదని ఆ హీరో ఫైర్ అయినట్టు పక్కనే ఉన్న ఆ సినిమా నిర్మాతల ద్వారా విషయం బయటకు పొక్కింది.
అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ సెట్ చేసినందుకు మధ్యవర్తిగా ఉన్న ఆ పెద్ద డైరెక్టర్‌కు ఈ సినిమా నిర్మాతల నుంచి కొంత అమౌంట్ ముట్టిందట. ఈ విషయం హీరోగారికి తెలియడంతో తనకు ఓ వీక్ సినిమా సెట్ చేసి ఆయన గారు కమీషన్ తీసుకున్నాడా ? అన్న కోపం కూడా హీరో గారికి ఉందట.
అయితే సదరు డైరెక్టర్ మరో పెద్ద హీరోకు ఓ మిడ్ రేంజ్ దర్శకుడి ప్రాజెక్టును కూడా ఇలా కమీషన్ బేస్ మీద సెట్ చేశారట. ఏదేమైనా వరుస హిట్లతో ఉంటూ ఒక్క డిజాస్టర్‌తో డీలా పడ్డ ఆ స్టార్ డైరెక్టర్ ఇలాంటి కమీషన్లకుకక్కుర్తి పడకుండా ఇప్పుడు ఓ పెద్ద హీరోతో చేసే సినిమా మీద కాన్‌సంట్రేషన్ చేయవచ్చు కదా ? అని ఇండస్ట్రీ వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు.