జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా భర్తల నుంచి చిన్న చిన్న కారణాలతోనే భార్యలు దెబ్బలు తింటున్నారని ఆ సర్వే స్పష్టం చేసింది. ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో తెలంగాణ వరకు చిన్న చిన్న కారణాలకే భర్తలు భార్యలను కొడుతున్నారట. ఈ సర్వేలో తెలంగాణలో 70.4% మంది పురుషులు మహిళలు, భార్యలను కొట్టడాన్ని సమర్థించుకుంటున్నారట.
ఇక్కడ భర్తలు.. భార్యలను కొట్టడానికి ఉన్న కారణాలు కూడా షాకింగ్‌గా ఉంటున్నాయి. ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం… భర్తతో వాదించడం.. నిర్లక్ష్యంగా ఉండడం.. శృంగారానికి ఒప్పుకోకపోవడం, వంట సరిగ్గా చేయకపోవడం, అబద్ధాలు చెప్పడం, అత్తమామలను గౌరవించకపోవడం లాంటివే కారణాలుగా ఉన్నాయి. భార్యలు తమ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించనప్పుడు కొట్టడం సమర్థనీయమే అని చాలా మంది పురుషులు అభిప్రాయ పడ్డారని సర్వే స్పష్టం చేసింది.
ఓవరాల్‌గా చూస్తే ఇంట్లో పిల్లలను సరిగా చూడడం లేదన్న కారణంతో 69 % – అత్తమామలను గౌరవించడం లేదని 67 % – ఇంట్లో చెప్పకుండా భయటకు వెళ్లడం లాంటి కారణాలతో 31 % – భర్తతో వాదించినందుకు దెబ్బలు తిన్న భార్యలు 29 % – అలాగే భార్య అబద్ధం చెప్పినా లేదా భర్తకు అనుమానం వచ్చేలా వ్యవహరించినా కొట్టినట్టు 26.8 % మంది భర్తలు సమర్థించుకున్నారు.
ఇక లైంగీక సంపర్కానికి ఒప్పుకోకపోతే కొట్టడాన్ని 16.9 % మంది భార్యలు సమర్థించుకుంటున్నారు. ఇక భార్య సరిగా వంట చేయకపోతే కొట్టడాన్ని 15 % మంది సమర్థించుకున్నారు. ఓవరాల్‌గా అనేకానేక కారణాలతో 70. 4 % మంది పురుషులు భార్యలను కొడుతున్నట్టు చెప్పారని సర్వే స్పష్టం చేసింది. ఇక ఓవరాల్‌గా దేశవ్యాప్తంగా చూస్తే భార్య, భర్తల కోట్లాటలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది.
భార్యాభర్తల హింసలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. దాదాపు 48% మంది మహిళలు అక్కడ భర్తల నుంచి హింసను ఎదుర్కొంటున్నారు. బిహార్‌లో 43 % మంది ఉన్నారు. ఇక ఏపీలో 34 % మంది మహిళలు భర్తల హింస ఎదుర్కొంటున్నారు. భర్తలు.. భార్యలను కొట్టడంలో సాధారణమైంది చెంపదెబ్బ. పెళ్లయిన వారిలో 25 % మంది భర్తలు చెంపదెబ్బలే కొడుతున్నట్టు సర్వే చెప్పింది. మరి కొందరు గిల్లడం.. జుట్టు లాగడం.. మరి కొందరు భర్తలు పిడిగుద్దులు గుద్దడం చేస్తున్నారట.