Healthశృంగారం చేయ‌క‌పోతే ఇంత డేంజ‌రా... స‌ర్వేలో షాకింగ్ నిజాలు...!

శృంగారం చేయ‌క‌పోతే ఇంత డేంజ‌రా… స‌ర్వేలో షాకింగ్ నిజాలు…!

శృంగారానికి మ‌నిషి జీవితానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మ‌నిషి జీవితంలో ఆక‌లి, ద‌ప్పిక ఎంత ముఖ్య‌మో శృంగారం కూడా అంతే ముఖ్యం. శృంగారం అనేది మ‌నిషి జీవితంలో ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. ఉత్సాహం ఇస్తుంది. శృంగారం అనేది మ‌నిషి ఆరోగ్యానికి ఎంతో ఉప‌యుక్త‌క‌ర‌మైన వ‌ర్క‌వుట్‌. ఎన్నో కేల‌రీలు దీని వ‌ల్ల ఖ‌ర్చ‌వుతాయి. శృంగారంపై గ‌త కొన్నేళ్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. ఈ ప‌రిశోధ‌న‌ల్లో ఎన్నో విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

ఇక శృంగారం అనేది అక్ర‌మ సంబంధాల కంటే స‌క్ర‌మ సంబంధాల ద్వారానే జ‌ర‌గాల‌ని… అది కూడా రెగ్యుల‌ర్‌గా లేదా వారానికి ఒక‌టి రెండు రోజులు జ‌రుగుతూ ఉండాల‌ని కూడా తాజా అధ్య‌య‌నం తేల్చిచెప్పింది. ఈ అధ్య‌య‌నంలో ఎన్నో షాకింగ్ విష‌యాలు కూడా వెల్ల‌డ‌య్యాయి. ఇటీవ‌ల యువ‌త తీరు మారుతోంది. పెళ్లి చేసుకోవ‌డంలో అల‌స‌త్వం వ‌హిస్తున్నారు. 35 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు పెళ్లి చేసుకోకుండా ఉద్యోగం, కెరీర్ అంటూ లైఫ్‌ను బ్యాచిల‌ర్‌గా ఎంజాయ్ చేస్తూ వ‌స్తున్నారు.

అయితే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటాక కూడా పెళ్లికాని ప్ర‌సాదులుగా ఉంటోన్న వారికి చాలా అన‌ర్థం ఉంద‌ని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ చేసిన అధ్యయనం చెపుతోంది. పెళ్లి చేసుకోకుంటే వ‌చ్చే అన‌ర్థాలు… ముఖ్యంగా శృంగారం లేకుండా బ్యాచిల‌ర్ లైఫ్‌తో ఉండే వారి కంటే… పెళ్లి చేసుకుని శృంగార జీవితం ఎంజాయ్ చేసే వారి లైఫ్ పెరుగుతుంద‌ట‌.

ఒంట‌రిగా జీవించే వారిలో హార్ట్ ఎటాక్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా ఎక్కువుగా ఉన్నాయ‌ట‌. పెళ్లి కాని వారిలో గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఎక్కువుగా వ‌స్తాయ‌ట‌. ఒంట‌రిగా బ‌తికే వారిక‌న్నా కుటుంబంలో ఉంటూ క‌లిసి జీవించే వారు క్లిష్ట ప‌రిస్థితులు త‌ట్టుకుని కూడా జీవిస్తార‌ని.. వీరు ఇబ్బందుల‌ను కూడా త‌ట్టుకుని నిల‌బ‌డే ధైర్యం క‌లిగి ఉంటార‌ని ఈ స‌ర్వే చెప్పింది.

స‌క్ర‌మ ఆరోగ్య జీవ‌నానికి పెళ్లి అనేది ఒక చ‌క్క‌టి మార్గ‌ని ఈ అధ్య‌య‌నం చెప్పింది. ఇక ఏదైనా అనారోగ్యానికి గురైన‌ప్పుడు కూడా పెళ్ల‌యిన వారే త్వ‌ర‌గా కోలుకుంటున్నార‌ట‌. ముఖ్యంగా హార్ట్ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పాటు బీపీ స‌మ‌స్య‌లు పెళ్లి అయిన వారిలోనే త‌క్కువుగా క‌నిపిస్తున్నాయ‌ట‌. అందుకే పెళ్లికాని ప్ర‌సాదులు, మిస్స‌మ్మ‌లు త్వ‌ర‌గా పెళ్లి చేసుకుంటే వారికే మంచిది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news