టాలీవుడ్లో మంచి క్యారెక్టర్ నటుల్లో సుబ్బరాజు కూడా ఒకరు. సుబ్బరాజు ఎలాంటి రోల్లో అయినా నటించేస్తాడు. సీరియస్‌గా, విలన్‌గా, బాహుబలి 2లో రాజవంశీకుడిగా, డీజేలో కామెడీ విలన్‌గా ఏ పాత్ర అయినా ఆయనకు కొట్టిన పిండే. పాజిటివ్, నెగిటివ్ ఏ పాత్రలో అయినా సుబ్బరాజు ఇట్టే ఒదిగిపోతాడు. మిర్చి సినిమాలో ముందు సుబ్బరాజు నెగిటివ్ పాత్రలోనే కనిపిస్తాడు. ఆ తర్వాత ప్రభాస్ సుబ్బరాజు క్యారెక్టర్‌ను పూర్తిగా మార్చేసి మనలను నవ్వించేస్తాడు.
ఖలేజా సినిమాతో పాటు బాహుబలి 2 సినిమాలోనూ సుబ్బరాజు తన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా సుబ్బరాజు తెరమీద చేసే వీనులవిందు గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి మనకు పెద్దగా తెలియదు. నటుడిగా సక్సెస్ అయిన సుబ్బరాజు వయస్సు 45 ఏళ్లు. ఏజ్ పెరిగినా సుబ్బరాజు వివాహం ఎందుకు ? చేసుకోలేదు అన్న డౌట్ చాలా మందికి ఉంది.
ఇదే ప్రశ్న సుబ్బరాజుకు కూడా ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. ఈ ప్రశ్నకు సుబ్బరాజు కూడా ఆసక్తికరమైన ఆన్సరే ఇచ్చాడు. అసలు పెళ్లి ఎందుకు ? చేసుకోవాలో కూడా తనకు అర్థం కావడం లేదని చెప్పాడు. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా ఉండదని.. అసలు తనకు పెళ్లి అవసరం రాలేదని సుబ్బరాజు షాకింగ్ కామెంట్స్ చేశాడు. పెళ్లి జరగడం వేరు.. చేసుకోవడం వేరని అన్నాడు.
పెళ్లి జరగడం అంటే అది బలవంతంగా పెద్దల కోసం చేసుకోవడమే అని.. పెద్దల కోసం ఇబ్బంది పడుతూ పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. దానిని తాను పెళ్లి అని భావించలేనని చెప్పాడు. పెళ్లి అంటే ఇవ్వడం అని.. తాను లైఫ్ లాంగ్ తనను తాను పూర్తిగా జీవితం మరొకరికి ఇవ్వగలను అని భావించినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని సుబ్బరాజు చెప్పాడు.