టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రెండున్నర సంవత్సరాల తర్వాత సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు లాంటి హిట్ సినిమా తర్వాత మహేష్ గీతగోవిందం లాంటి హిట్ డైరెక్టర్ పెట్ల పరశురాంతో జోడీ కట్టడంతో ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ ఉంటుందన్న అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. తాజాగా సర్కారు వారి పాట ఫస్ట్ గ్లింప్స్‌తో మొదలు పెట్టి, స్టిల్స్, ట్రైలర్ వరకు అన్ని చూస్తుంటే మహేష్ నుంచి మనం దూకుడు రేంజ్ కామెడీ, పవర్ ఫ్యాక్డ్ ఎంటర్టైనర్ స్టోరీని చూస్తున్నామన్నది తెలిసిపోతోంది.
పైగా మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ లాంటి క్రేజీ హీరోయిన్ నటించడం.. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాయి. పైగా కళావతి సాంగ్ అయితే రికార్డులతో దూసుకుపోతోంది. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోన్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ చూసిన సభ్యులు చాలా పాజిటివ్‌గా స్పందించడంతో పాటు మహేష్ కెరీర్‌లో మరో సూపర్ హిట్ ఖాయమని తీర్పు ఇచ్చినట్టు తెలుస్తోంది.
సెన్సార్ నుంచి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేశారట. అయితే రన్ టైం మాత్రం కాస్త ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. సర్కారు వారి పాట 2 గంటల 40 నిమిషాలు అంటే… 160 నిమిషాల రన్ టైం కలిగి ఉంది. రన్ టైం కాస్త ఎక్కువే ఉన్నట్టు ఉన్నా ఇటీవల కాలంలో స్టార్స్ సినిమాలు అన్నీ కూడా 150 – 170 నిమిషాల రన్ టైం కలిగి ఉంటున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమాకు ఏకంగా 186 నిమిషాల రన్ టైం ఉంది.
థియేటర్లో ప్రేక్షకులను కూర్చోపెట్టే కంటెంట్ ఉండాలే కాని.. రన్ టైం అన్నది ఇటీవల కాలంలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పైగా రెండున్నరేళ్ల తర్వాత వస్తోన్న మహేష్ సినిమా కావడంతో పాటు.. గీతగోవిందం తర్వాత పరశురాం నుంచి వస్తోన్నసినిమా.. కీర్తి సురేష్ అందాలు, థమన్ స్వరాలు.. సినిమా సూపర్ హిట్ అని ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ముందుగానే చెప్పడంతో సర్కారు వారి పాటపై బజ్ మామూలుగా లేదు.
ఇక ఓవర్సీస్ బుకింగ్స్ చూస్తుంటే రిలీజ్‌కు ముందే ఈ సినిమా మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరేలా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లు స్పీడప్ చేయనున్నారు. ప్రస్తుతం మహేష్ దుబాయ్ ఫ్యామిలీ వెకేషన్‌తో ఉన్నాడు. అక్కడ నుంచి వచ్చిన వెంటనే మహేష్ కూడా ప్రమోషన్లలో పాల్గొంటాడు. ఏదేమైనా సర్కారుకు ప్రి రిలీజ్ బజ్ అయితే చాలా పాజిటివ్‌గా ఉంది.