ఏ మాయ చేశావే అంటూ ఇండస్ట్రీలోకి వచ్చిన సమంత కొన్నాళ్ల పాటు తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలను ఏలేసింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మరింత స్పీడ్ పెంచేసింది. వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం, యశోద అనే థ్రిల్లర్ మూవీ, కోలీవుడ్‌లో కార్తీతో మూవీ… బాలీవుడ్, హాలీవుడ్ ప్రయత్నాలు కూడా చేస్తోంది. అయితే బాలీవుడ్‌లో హాట్ వెబ్‌సీరిస్‌లు చేసిన సమంత డెబ్యూ మూవీ మాత్రం చేయలేదు.
సమంత డెబ్యూ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నా ఆమెకు అక్కడ రెండో హీరోయిన్ రోల్స్ రావడం.. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఒప్పుకోవడం లేదన్న ప్రచారమే ఇప్పటి వరకు జరిగింది. వాస్తవంగా గత ఆరు నెలల నుంచి సమంత బాలీవుడ్ ట్రైల్స్ కోసం చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. సమంతకు ఎంతో క్రేజ్ ఉందన్నది వాస్తవం. చైతుతో విడాకుల తర్వాత కూడా ఆమెకు ఈ స్థాయిలో ఆదరణ ఉండడంతో చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు.
అయితే బాలీవుడ్ ఛాన్సులు రావడం లేదనో మరేదైనా కారణమో గాని.. సమంత ఇప్పుడు కాస్త బోల్డ్‌నెస్‌గా కనిపించేందుకు బాలీవుడ్ వాళ్లకు ఓపెన్ ఆఫర్లు ఇచ్చేసిందని తెలుస్తోంది. ద ఫ్యామిలీ మ్యాన్ 2 సీరిస్‌తో ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ వెబ్ సీరిస్‌లో ఆమె ఎంత బోల్డ్‌గా కనిపించిందో తెలిసిందే. అంతెందుకు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌లోనూ ఆమె అంతే బోల్డ్‌గా కనిపించింది.
ఎలాగైనా బాలీవుడ్‌లో మాంచి ఛాన్స్ పట్టడంతో పాటు తొలి ప్రయత్నంలోనే నిలదొక్కుకావాలన్న ఉత్సాహంతో ఉన్న సమంత ఓ డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కథతో ఇంప్రెస్ అయినట్టు టాక్ ? ఓ పెద్ద బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సమంతకు తెలుగు, తమిళ భాషల్లో ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకునే క్రమంలో ఆమెను హాట్‌గా చూపించే ప్రయత్నంలోనే ఈ కథ రాసుకున్నారట.
సమంత పుష్ప, ది ఫ్యామిలీ మ్యాన్ సీరిస్‌ల్లో కనిపించిన హాట్‌నెస్‌కు మించి మరీ ఈ సినిమాలో రెచ్చిపోబోతోందని తెలుస్తోంది. ఏదేమైనా సమంత అందాల డోస్ మరింత పెరగబోతోందన్న మాట.