ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పార్టీలు అంటే చాలు ..సినిమాలోకన్నా గ్లామరస్ గా కనిపించడానికి ట్రై చేస్తూ..తమ డిజైనర్స్ తో రకరకాల కాస్ట్యూమ్స్ ని వేసుకుంటున్నారు. కొందరు ఆ డ్రెస్ లతో కుర్రాళ్ళను రెచ్చకొడుతున్నారు ..మరి కొందరు..ఆ తల తోక లేని డ్రెస్ ని వేసుకుని హ్యాండిల్ చేయలేక …క్రింద పడిపోతున్నారు. ఇలాంటి సంధర్భాలు మనం చాలా చూశాం. గతంలో రెడ్ కార్పెట్ పై నడిచేటప్పుడు, అవార్డ్ ఫంక్షన్ల కి వెళ్లినప్పుడు..హీరోయిన్స్ డ్రెస్ లని మ్యానేజ్ చేయలేక అడ్డంగా బుకైయ్యారు.
ఇక ఇప్పుడు రష్మిక ఫస్ట్ టైం అలా..తన డ్రెస్ హ్యాండిల్ చేయలేకపోయిందనే టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకలన చాలా గ్రాండ్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు స్టార్ హీరోహీరోయిన్లు విచ్చేసి సందడి చేశారు. వీరిలో జాన్వీ, మలైకా, కియారా, రష్మిక, తమన్నా, విజయ్, కొత్త జంటలు కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్, రణ్బీర్-ఆలియా భట్లు సందడి చేశారు.
అయితే ఈ పార్టీలో రష్మిక మందన్నా..లుక్స్ టూ హాట్ గా కనిపించాయి. బ్లాక్ డ్రెస్ లో ఆమె వయ్యారాలు చిందిస్తూ ఆ రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే..కుర్రాళ్ళ గుండెలు జారిపోయాయి. పార్టీ మొత్తానికి ఈ రష్మిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పర్ఫెక్ట్ ఫిజిక్ తో ధైస్ ఎక్స్ పోజ్ చేస్తూ..ఆ క్యూట్ స్మైల్ తో ఆమె ను చూసిన స్టార్స్ ఫిదా అయిపోయారు. కానీ, ఆ పార్టీలో ఆమె మాత్రం కొంత అసౌకర్యంగా ఫీలైంది. అందుకు కారణం ఆమె డ్రెస్.
ఆ డిజైనర్ మోడ్రెన్ స్టన్నింగ్ లుక్ డ్రెస్ లో రష్మిక నడవలేక పోయింది. నడుస్తున్న ప్రతి సారి డ్రెస్ పక్కకు వెళ్లిపోవడం..ఆమె సర్దుకోవడం..కొన్ని సార్లు నడవడానికి ఇబ్బందిగా ఫీల్ అవ్వడం మనం వీడియో లో చూడవచ్చు . దీంతో నెటిజన్స్ తమ నోటికి పనిచెప్పారు. మనకి సౌకర్యంగా లేని డ్రెస్ వేసుకోవడం ఎందుకు అంటూ తిట్టిపోస్తున్నారు.