ఢిల్లీ గర్ల్ రాశీ ఖన్నా మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి తెలుగులో ఊహలు గుసగుసలాడే వేళ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆమె వెండితెర ఎంట్రీ ఇచ్చి ఏడెనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటకీ స్టార్ హీరోయిన్ స్టేటస్ రాలేదు. ఆమెకు క్రేజీ హీరోలతో ఛాన్సులు పడలేదు. ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో ఛాన్స్ వచ్చినా మూడు ఎన్టీఆర్ పాత్రల మధ్యలో ఇద్దరు హీరోయిన్లు ఉండడంతో అసలు రాశీఖన్నా ఆ సినిమాలో ఉందన్న విషయమే చాలా మందికి గుర్తులేదు.
కట్ చేస్తే సాయిధరమ్ తేజ్‌తో సుప్రీమ్, ప్రతిరోజు పండగే లాంటి హిట్ సినిమాలు చేసింది. అప్పుడెప్పుడో గోపీచంద్‌తో జిల్ సినిమా చేసిన ఈ అమ్మడు మళ్లీ ఇన్నేళ్లకు పక్కా కమర్షియల్ సినిమా చేసింది. ఈ సినిమా జూలై 1న విడుదల అవుతోంది. హిందీలో యోధా అనే సినిమా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాశీ తన అందచందాలు చూపిస్తూ హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.
కెరీర్ స్టార్టింగ్‌లో చాలా బొద్దుగా, లావుగా ఉండే రాశీఖన్నా తర్వాత వర్కవుట్లు చేసి కాస్త నాజూగ్గా తయారైంది. మధ్యలో ఆమె టాలీవుడ్‌కే చెందిన ఓ కుర్ర హీరోతో ఎఫైర్ నడుపుతున్నట్టు వార్తలు వచ్చినా అవి సైలెంట్ అయ్యాయి. ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ / నార్త్‌లో ఓ భాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న ప్రచారమూ జరిగింది. తర్వాత అవన్నీ సైలెంట్ అయ్యాయి. తాజాగా తన ఇన్‌స్టా గ్రామ్ అక్కౌంట్ ద్వారా ఓ ఫొటో షేర్ చేసింది.
ఆ ఫొటోలో ఆమె కెమేరా వైపు చూస్తూ ఉంది. కెమేరానే తన లవర్‌గా భావించి ఇలా పోస్టు చేసింది. తన లవర్ అంటూ ఆమె కెమేరాను చూపించింది. దీంతో లవర్‌ను పరిచయం చేస్తూ కెమేరాను చూపించడం ఏంటో తెలియక నెటిజన్లు అవాక్కవుతున్నారు. రాశీఖన్నా బరువు తగ్గి కాస్త స్లిమ్‌గా మారాక మరింత గ్లామర్‌గా మారడంతో పాటు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి.
View this post on Instagram