రమ్యకృష్ణ..పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందంతో నటనతో ..కోట్లాది అమ్మది హృదయాలను కొల్లగొట్టిన బ్యూటి. 1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఓ వెలుగు వెలిగిన అందాల తార రమ్యకృష్ణ. నీలాంబరి అయిన, శివగామి అయిన, దేవత అయిన రమ్యకృష్ణ తన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుంది.
దక్షిణాది లేడి సూపర్‌స్టార్ రమ్యకృష్ణ గురించి ..ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన పర్ ఫామెన్స్ తో స్టార్ హీరోలకు సైతం..దడ పుట్టించిన రమ్య అంటే..ఇండస్ట్రీలో అందరికి ఇష్టమే. యాక్టింగ్ అయినా.. గ్లామర్ అయినా అన్నింట్లోనూ రమ్యకృష్ణ నెంబర్ వన్. ఇప్పటికీ తన నటనతో కుర్ర హీరోయిన్లకు కూడా షాక్ ఇస్తుంది ఈ భామ.
ఇండియన్ ఇండస్ట్రీని తన అందాలతో.. అభినయంతో ఆడుకుంది రమ్యకృష్ణ. కొన్నేళ్ల పాటు నెంబర్ వన్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఇండస్ట్రీ ఏదైనా తన నటనతో అందరికీ పిచ్చెక్కించింది ఈ నీలాంబరి. బాహుబలిలో శివగామీ దేవిగా యావత్ ప్రపంచాన్ని మెప్పించింది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. మూడు దశాబ్దాలుగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా, టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రమ్యకృష్ణ రాణిస్తూనే ఉన్నారు.సెకండ్ ఇన్నింగ్స్‌లోను క్షణం తీరక లేకుండా సినిమాలు చేస్తున్న రమ్య ప్రస్తుతం తన భర్త దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తోంది. ఈ సినిమా నట సామ్రాట్ అనే ఓ మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది.
రమ్య కృష్ణ తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒక్క సినిమా ఎప్పతికి ఉంటుంది. అదే..”నరసింహా”. కేఎస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నరసింహా సినిమా వచ్చింది. ఆ సినిమాలో రజనీకి ధీటుగా పవర్ ఫుల్ విలన్‌గా రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో నటించింది. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ముఖ్యం గా సినిమాలో రజనీ-రమ్య మధ్య వచ్చే సీన్స్ ఇప్పుడు చూస్తున్న గూస్ బంప్స్ వస్తాయి. నీలాంబరి పాత్రలో రమ్య నటించలేదు జీవించేసింది.
కాగా, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యుల్లో పాల్గొన్న ఈ మూవీ డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ..సినిమాలో రమ్య ఓ సీన్ చేయని ఏడ్చేసిందట. అందరు బలవంతం చేస్తేనే అలా నటించిందట. సినిమాలో సౌందర్య అంటే రమ్యకి అస్సలు పడదు. తాను చేసుకోవాలి అనుకున్న అబ్బాయిని ఆమె చేసుకోవడం తో కోపం కాస్త పగ గా మార్చుకునేస్తుంది. ఈ సినిమాలో రమ్య సౌందర్య తన కాళ్లతో ఆమె ముఖం పై తాకే సీన్ ఒకటి ఉంది.
నిజానికి ఆ సీన్ చేయడం రమ్యకి ఇష్టం చేదట. ఆమె పెద్ద హీరోయిన్ ..ఆమె ఫ్యాన్స్ నన్ను తిడుతారు అంటూ ఏడ్చేసిందట. చివరకు రమ్యకృష్ణ కాలుని తీసుకుని సౌందర్యనే ముఖంపై పెట్టుకుంది. తర్వాత రమ్య నటించింది. సౌందర్య, డైరెక్టర్స్ అందరూ బలవంతం చేయడంతోనే సీన్ చేసిందట. రమ్య పొగరే సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్.