టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరోలు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమా త్రిబుల్ ఆర్. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం గా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి – ది కంక్లూజన్ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేయడంతో సినిమా రు. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర జర్నీ స్టార్ట్ చేసింది.
సినిమాపై ఉన్న భారీ అంచనాలతో పోలిస్తే కాస్త తగ్గిందన్న టాక్ అయితే వినిపించింది. తాజాగా ఈ సినిమా 50 రోజుల రన్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఓ సినిమాకు ఎంత హిట్ టాక్ వచ్చినా రెండు వారాలు థియేటర్లలో నడిస్తేనే గొప్ప అన్నట్టుగా ఉంది. అలాంటిది త్రిబుల్ ఆర్ ఏకంగా 500 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ టైంలో దేశవ్యాప్తంగా 500 సెంటర్లకు పైగా 50 రోజులు ఆడడం అంటే సెన్షేషనల్ రికార్డు అయ్యింది.
కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా యూరప్ నటి ఓలీవియా మోరిస్, చెర్రీకి జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించారు. బాహుబలి 2, దంగల్ తర్వాత ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా త్రిబుల్ ఆర్ నిలిచింది. ఇంత గొప్ప విజయం సాధించడంతో తెలుగు సినిమా రేంజ్ మరోసారి నేషనల్ వైడ్‌గా వెళ్లింది.
ఈ క్రెడిట్ ఖచ్చితంగా రాజమౌళికే దక్కుతుంది. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక త్రిబుల్ ఆర్ విజయంతో ఊపుమీదున్న రాజమౌళి తన నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ మహేష్‌బాబుతో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది.