యంగ్ రెబల్ స్టార్ వరుస పెట్టి క్రేజీ పాన్ ఇండియా సినిమాలతో దూసుకు పోతున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన పాన్ ఇండియా క్రేజ్‌ను అలా కంటిన్యూ చేస్తున్నాడు. సాహో – రాధేశ్యామ్ ఇప్పుడు సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలు ఇవి చూస్తుంటే ప్రభాస్ లైనప్ నేషనల్ వైడ్‌గా ఏ స్టార్ హీరోకు లేనంత రేంజ్‌లో ఉంది. సాహో అంచనాలు అందుకోలేకపోయినా బాలీవుడ్‌లో రు. 150 కోట్లు రావడంతో నిర్మాతలు గట్టెక్కేశారు. అయితే రాధేశ్యామ్ మాత్రం ఘోరంగా ప్లాప్ అయ్యింది.
అయినా కూడా ప్రభాస్ లైనప్‌లో భారీ పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి. మధ్యలో సడెన్‌గా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడన్న ప్రచారం గట్టిగా జరిగింది. హర్రర్, క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారన్న టాక్ కూడా బయటకు వచ్చింది. రాధేశ్యామ్ సినిమా టైంలో రిలీజ్‌కు ఆర్థిక ఇబ్బందులు వస్తే డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ అధినేత దానయ్య ప్రభాస్ కోరిక మేరకు సింగిల్ పేమెంట్‌లో రు. 100 కోట్లు ఇచ్చాడన్న టాక్ వచ్చింది.
ఈ క్రమంలోనే దానయ్య బ్యానర్లో సినిమా చేసేందుకు 60 కాల్షీట్లు ఇచ్చాడని అనుకున్నారు. ఈ యేడాదిలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారన్న ప్రచారమే నిన్నటి వరకు జరిగింది. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ఇప్పుడు తన భారీ పాన్ ఇండియా లైనప్‌ను కాదనుకుని.. మారుతితో సినిమా చేసేందుకు ప్రభాస్ ఇష్టపడడం లేదట.
రాధేశ్యామ్ ప్లాప్ అయ్యింది. ఈ టైంలో పాన్ ఇండియా లైనప్‌ను కాదనుకుని.. మారుతి సినిమా చేస్తే అది తన మార్కెట్ మరింత డౌన్ అయ్యేందుకు కారణం అయినా కావొచ్చనే ప్రభాస్ భావిస్తున్నాడట. అందుకే ముందుగా సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే మీదే కాన్‌సంట్రేషన్ చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత అప్పటి వాతావరణం బట్టే మారుతి సినిమా ఉంటే ఉండొచ్చని అంటున్నారు.
మధ్యలో సందీప్ వంగా పాన్ ఆసియా ప్రాజెక్ట్ స్పిరిట్ కూడా ఉంది. ఇది కూడా ముందే పూర్తి చేయాలని సందీప్ భావిస్తున్నాడు. అంటే మారుతి మరో 3 ఏళ్ల పాటు ప్రభాస్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.
మారుతి పరిస్థితే ఇలా ఉంటే… మరి అప్పటి వరకు రు. 100 కోట్ల అడ్వాన్స్ ఇచ్చిన దానయ్య పరిస్థితి ఏంటో ?