సినిమా అనేది హిట్… ప్లాప్ అనే సూత్రాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టుగా.. సినిమా రంగంలో విజయాలు ఉన్న వాళ్ల దగ్గరే మనుష్యులు ఉంటారు.. అదే ఒకటి రెండు ప్లాపులు పడితే ఎంత పెద్ద హీరో అయినా, డైరెక్టర్, హీరోయిన్ అయినా వారి వెంట పడేందుకు ఎవ్వరూ ఇష్టపడరు. అంటే సక్సెస్ అనేదే ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మన హీరోలు కూడా హిట్లు ఇచ్చిన దర్శకుల వెంటే పడుతూ ఉంటారు.
ఇక్కడ ఎవ్వరిని తప్పు పట్టలేం. ఎవరైనా రిస్క్ చేసేందుకు ఇష్టపడరు. ఉదాహరణకు మహేష్ వరుసగా సక్సెస్‌లో ఉన్న కొరటాలతో భరత్ అనే నేను – వంశీ పైడిపల్లితో మహర్షి – అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు – తాజాగా గీతగోవిందం సక్సెస్‌లో ఉన్న పరశురాంతో సర్కారు వారి పాట చేశాడు. అటు బన్నీ అయినా రంగస్థలం తర్వాత సుకుమార్‌తో పుష్ప చేశాడు. అరవిందతో ఫామ్‌లోకి వచ్చిన త్రివిక్రమ్‌తో అల వైకుంఠపురంలో చేశాడు.
అయితే ఎన్టీఆర్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్లాప్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు. ఇందుకు ఎన్టీఆర్ గట్స్‌కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్లతో సినిమాలు చేస్తే ఆ సినిమాకు అనుకున్నంత బజ్ ఉండదు. బయ్యర్లు అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ఎక్కువ రిస్క్ చేయరు. ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు తక్కువుగా ఉంటాయి. అయినా ఎన్టీఆర్ ఐదు ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్లతో సినిమాలు చేసి హిట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు.
మున్నా ప్లాప్ తర్వాత సినిమాలు మానేద్దామన్నంత డిఫెన్స్‌లోకి వెళ్లిపోయిన వంశీ పైడిపల్లికి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చి బృందావనం చేసి హిట్ కొట్టాడు. పూరి జగన్నాథ్ వరుస ప్లాపుల్లో ఉండి ఏ హీరో దగ్గరకు రానివ్వనప్పుడు టెంపర్ చేసి హిట్ ఇచ్చాడు. పూరి ఈ విషయంలో తాను ఎన్టీఆర్‌కు ఎప్పటకీ రుణపడి ఉంటానని చెప్పాడు. వన్ నేనొక్కడినే సినిమాతో డీలా పడిన టైంలో సుకుమార్‌కు పెద్ద రిస్క్ చేసి నాన్నకు ప్రేమతో సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అయ్యింది.
సర్దార్ గబ్బర్‌సింగ్ ప్లాప్ తర్వాత నిరాశలో ఉన్న బాబితో జై లవకుశ సినిమా చేసి హిట్ కొట్టాడు. పైగా ఇదే సినిమాతో నిర్మాతగా వరుస ప్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న కళ్యాణ్‌రామ్‌ను కూడా సేవ్ చేశాడు. ఇక అజ్ఞాతవాసి తర్వాత ..ఆ సినిమా రిజల్ట్ చూసి త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలే భయపడ్డారు. ఆ టైంలో ఎన్టీఆర్ డేర్ చేసి అరవింద సమేత వీరరాఘవ చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్.
ఏదేమైనా ఎన్టీఆర్ ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్లు టెన్షన్ పడుతుంటే.. రిస్క్ చేసి మరీ వాళ్లతో సినిమాలు చేసి హిట్లు కొట్టడం అంటే చాలా డేరింగ్ స్టెప్ అనుకోవాలి. టాలీవుడ్‌లో ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా ఇంత పెద్ద రిస్క్ చేసి హిట్లు కొట్టిన దాఖలాలు అయితే మనం చూడలేం.