టాలీవుడ్లో ఆ స్టార్ హీరో వరుసగా సినిమాలు తీస్తున్నాడు. అయితే హిట్లు మాత్రం అప్పుడుప్పుడూనే వస్తున్నాయి. ఒక హిట్ వస్తే.. మూడు నాలుగు ప్లాపులు. గత కొన్నేళ్లలో అతడు చేసిన సినిమాల్లో గతేడాది వచ్చిన ఒక్క సినిమా మాత్రమే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాస్త లాభాలు తెచ్చిపెట్టింది. అయితే హిట్ వచ్చిన ప్రతిసారి రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతున్నాడు.
తాజాగా బిగ్గెస్ట్ అట్టర్ ప్లాప్ ఇచ్చాడు. ఆ సినిమా విషయంలో ముందు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు బిజినెస్ ఎక్కువ జరిగిందని చెప్పి మరో కోటి రూపాయలు అదనంగా గుంజేశాడు. పైగా రిలీజ్‌కు ముందే డైరెక్టర్‌తో సున్నం పెట్టుకున్నాడు. నిర్మాత, దర్శకుడిపై సెటైర్ వేశాడు. సినిమా ఘోరంగా బాల్చీ తన్నేసింది. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాల్లో ఓ సినిమాకు రు. 17 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. మరో సినిమాకు రు. 19 డిమాండ్ చేయగా.. గత్యంతరం లేని నిర్మాత ఓకే చెప్పాడు.
ముందు భేరం ఆడుకునేటప్పుడు ఒకలా చేస్తూ తర్వాత సినిమా షూటింగ్ చివరకు వచ్చేసరికి నిర్మాతలకు చుక్కలు చూపించేస్తున్నాడట. ఇక తాజా సినిమా విషయంలో మరో ట్విస్ట్ జరిగింది. రౌండ్ ఫిగర్‌గా రు. 20 ఇవ్వాలని డిమాండ్ చేశాడట. అతడు తీసుకోవడం అతడి డిమాండ్‌ను బట్టి ఉంటుంది. అది తప్పుకాకపోయినా.. ముందు ఓ రేటు మాట్లడుకుని.. తర్వాత చివర్లో తాను షూటింగ్‌కు రాను.. డబ్బింగ్ చెప్పను అని నిర్మాతలను బ్లాక్మెయిల్ చేస్తూ ఎక్కువ గుంజేస్తున్నాడు.
తాజా సినిమా విషయానికి వస్తే ముందు ఓ రేటు అనుకోగా నిర్మాత 20 శాతం అడ్వాన్స్ ఇచ్చాడట. తీరా అగ్రిమెంట్ఖు వచ్చేసరికి మరో కోటి ఇవ్వండి.. రౌండ్ ఫిగర్ బాగుంటుందని చెప్పడంతో నిర్మాత ఆ అడ్వాన్స్ వెనక్కు తీసుకోలేక.. సినిమా క్యాన్సిల్ చేసుకోలేక రు 20 కోట్లు ఇస్తున్నాడట. అసలే ఈ సినిమాకు భారీ బడ్జెట్.. హీరోయిన్… ఇతర కాస్టింగ్ కోసమే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు హీరో వేసిన దెబ్బకు మరో కోటి చేతి చమురు వదిలింది.
ఇక కేవలం ఏ నిర్మాత ఎక్కువ డబ్బు ఇస్తే ఆ నిర్మాతలకే కాల్షీట్లు ఇస్తూ అసలు కథ, కథనాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదట. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న చందంగా ఆ హీరోకు బాగా డబ్బు పిచ్చి పట్టేసిందని అంటున్నారు. అతడితో సినిమాలు చేసే నిర్మాతలకు చుక్కలు ఓ రేంజ్లో కనిపిస్తున్నాయట.