ప్రజెంట్ జనరేషన్ ఎక్కువుగా సోషల్ మీడియాలోనే గడుపుతుంది. ప్రొద్దున లేచిన మొదలు..రాత్రి పడుకునే వరకు అంతా..సోషల్ మీడియా మయం అయిపోతుంది. బెడ్ పై నుంచే చాటింగులు అంటూ..మొదలు పెట్టి..అర్ధరాత్రి వరకు ఆ ఫోన్ ని వదలకుండా..దానికి బానిస అయిపోతున్నారు. మంచి కోసం, చదువు కోసం, కెరీర్ లో సెటిల్ అవ్వడానికి కొందరు సోషల్ మీడియాను వాడుకుంటుంటే..మరి కొందరు తమను పాపులర్ చేసుకోవడానికి వాడుకుంటున్నారు.
ఆ లిస్ట్ లో బుల్లి తెర సెలబ్రిటీలు ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా ఆ లిస్ట్ లో టాప్ లో ఉంది హాట్ బ్యూటీ అషూ రెడ్డి. ఒకప్పుడు అంటే ఈ పేరుకు ఇంట్రడక్షన్ కావాలి కానీ, ఇప్పుడెందుకు . అస్సలు ఈమె పేరు తెలియని వారుంటారా ఈ రోజుల్లో..సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు సెన్సేషన్ కంటెంట్ ఇచ్చే ఆషూ అంటే కుర్రాళ్ళకు అదో తెలియని మోజు. అమ్మడు కూడా ఎక్కడ తగ్గకుండా..తన అందాలతో కుర్రాళ్లను ఎంటర్ టైన్ చేస్తుంటుంది. టిక్‌టాక్ వీడియోస్‌తో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 3 ఆఫర్ కొట్టేసింది. దీంతో మరింత పాపులర్ అయిన అషూ రీసెంట్‌గా బిగ్‌బాస్ ఓటీటీలోను అడుగుపెట్టింది.
టాప్ 5 లో నిలవకుండానే వెనుతిరిగింది. ఫినాలేకు అతి దగ్గర్లో ఉండగా అనూహ్యాంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది అషూ. ఇక అప్పటి నుంచి మళ్ళీ పాప సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారుతూ..హాట్‌హాట్ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె మిర్చి సినిమాలో అనుష్క చెప్పిన డైలాగ్‌పై ఓ గా రీల్ చేసి.. ‘కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకే కనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చెవారో తెలుసా?’ అని అంటూ ఓ దీని పై మీ మనసులో మాట చెప్పండి అంటూ ఓ క్యాప్షెన్ ఇచ్చింది. ఇక ఈ వీడియోను అస్త్రంగా చేసుకుని ఆషూ హేటర్స్ ఆమె పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. “ముందు మేకప్ లేకుండా కనపడు, నీ ఫేస్ కి గుర్రాలు కాదు గాడిదలు వస్తాయి,నువ్వు..నీ ప్లాస్టిక్ సర్జరీ ముఖం, మీకు అంత సీన్ లేదులే’ అంటూ దారుణంగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
View this post on Instagram