Movies#NBK107 షూటింగ్ స్టిల్ లీక్‌... ప‌వ‌ర్ ఫుల్ బాల‌య్యను చూశారా..!

#NBK107 షూటింగ్ స్టిల్ లీక్‌… ప‌వ‌ర్ ఫుల్ బాల‌య్యను చూశారా..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య న‌టిస్తోన్న తాజా సినిమా షూటింగ్ హైద‌రాబాద్ స‌మీప ప్రాంత‌మైన నాచారం ద‌గ్గ‌ర్లో జ‌రుగుతోంది. ప్ర‌త్యేకంగా వేసిన సెట్లో ఈ షూటింగ్ జ‌రుగుతోంది. క్రాక్ త‌ర్వాత మ‌లినేని గోపీచంద్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇటు అఖండ గ‌ర్జ‌న‌తో థియేట‌ర్ల‌లో గ‌ర్జ‌న చేసిన బాల‌య్య మార్కెట్ కూడా మామూలుగా లేదు. ఈ టైంలో వీరిద్ద‌రు క‌లిసి చేస్తోన్న సినిమా కావ‌డంతో అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి.

ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ తెలంగాణ‌లోని సిరిసిల్ల ప్రాంతంలో జ‌రిగింది. ఆ త‌ర్వాత సెకండ్ షెడ్యూల్‌ను హైద‌రాబాద్ స‌మీప ప్రాంతాల‌కు షిఫ్ట్ చేశారు. సినిమా హైద‌రాబాద్‌కు షిప్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ద‌ర్శ‌కుడు గోపీచంద్ శ‌ర‌వేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితిల్లోనూ వ‌చ్చే ద‌స‌రాకు సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకు రావాల‌న్న ప్లాన్‌తోనే మేక‌ర్స్ ఉన్నారు.

తాజాగా హైద‌రాబాద్ స‌మీప ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుగుతున్న ఈ సినిమా నుంచి బాల‌య్య స్టిల్ ఒక‌టి లీక్ అయ్యింది. బాల‌య్య వైట్ ఫ్యాంటు, వైట్‌ష‌ర్టు ధ‌రించి కాస్త జుట్టు, గెడ్డం పెంచి చాలా ర‌ఫ్ అండ్ ట‌ఫ్ లుక్‌లోనే ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. ఓ సైడ్‌గా చూస్తోన్న బాల‌య్య‌ను చూస్తుంటే ఆయ‌న రౌద్ర ర‌సంతోనే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. సెట్ చూస్తుంటే ఓ పాత ఇంటి వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

పాత ఇంటి వాసాల‌తో పాటు కింద సోఫా సెట్లు అన్ని కూడా ఓ ఉమ్మ‌డి కుటుంబ వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తున్నాయి. విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్లో క‌నిపిస్తార‌ట‌. రాయ‌ల‌సీమ‌లోని ఓ ప‌ల్లెటూరు నేప‌థ్యంలో సినిమా క‌థ ఉంటుంద‌ని అంటున్నారు. ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్ న‌టిస్తోన్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. అఖండ‌తో థియేట‌ర్ల‌లో సినిమా చూసిన వారికి పూన‌కాలు తెప్పించిన థ‌మ‌న్ ఈ సినిమాకు కూడా స్వ‌రాలు అందిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news