టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. 60 ప్లస్ లోను 30 పల్స్ కుర్రాడిలా కనిపించి అందరిని అబ్బురపరుస్తున్నాడు. నాగార్జున తన కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశాడు.. వాటిల్లో ఫ్లాప్ లు ఉన్నాయి..హిట్ల్ లు ఉన్నాయి. కానీ, నాగార్జున ఇష్టపడి ..దానికి కోసం ఎంతో కష్టపడి చేసిన సినిమాలు కొన్నే ఉన్నాయి. వాటిల్లో ఈ సంతోషం మూవీ కూడా ఒక్కటి. నాగార్జున కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిన ఈ సినిమా 2002 మే 9న ధియేటర్స్ లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు..నాగార్జున సినీ కెరీర్ కు ఎంతో ప్లస్ అయ్యింది.
నాగార్జున హీరోగా గ్రేసీ సింగ్, శ్రియ నాయికలుగా నటించిన ‘సంతోషం’ మూవీని దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు దశరథ్ పరిచయం అయ్యారు. 2002 మే 9న విడుదలై మంచి విజయం సాధించిన ఈ మూవీ నేతీతో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంధర్భంగా సంతోషం సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
ఆ రోజుల్లో ప్రేమ అంటే అర్ధం తెలియని వాళ్ళకి సరికొత్త అర్ధాని తెలియజేసింది ఈ సినిమా. ప్రేమించడానికి రెండు మనసులు చాలు.. కానీ పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి’ అనే పాయింట్‌తో డైరెక్టర్ దశరథ్ అధుబుతంగా తెరకెక్కించారు. పూర్తి కుటుంబ కధా చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ది బేస్ట్ సినిమా గా నిలిచింది.
కథాబలం ఉన్న ఈ చిత్రంతో కింగ్ నాగార్జున కెరీర్‌లో మరో మంచి విజయం నమోదైంది. ముఖ్యంగా ఈ సినిమా కి మరో ప్లస్ పాయింట్ మ్యూజిక్. ఈ సినిమాలో అన్ని పాటలు చాలా బాగా నచ్చాయి జనాలకి. ఆర్.పి. పట్నాయక్ స్వరపరచిన పాటలు బాగా పాపులర్ అయాయి. సీతారామశాస్త్రి, కులశేఖర్, విశ్వ పాటలు పలికించారు.
“నువ్వంటే నాకిష్టమని…”, “నే తొలిసారిగా…”, “మెహబూబా మెహబూబా…”, “ధీంతనట్కరి…”, “దేవుడే దిగివచ్చినా…”, “ఏమైందో ఏమో నాలో…”, “డిరి డిరి డిరిడీ…” అంటూ మొదలయ్యే పాటలు ఇప్పటికి పెళ్లిలల్లో సంగీత్ లల్లో ప్లే చేస్తుంటారు. పాత కధనే అయిన దశరథ్ కొత్త కోణంలో చూపించి.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. అలా నాగార్జున సంతోషానికి కారణమైయ్యాదు డైరెక్టర్. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా వస్తుందా అంటే రాదు అనే చెప్పాలి. అంతలా ఆకట్టుకుంది ఈ సినిమా. భైష్యతులో అయినా ఇలాంటి సినిమా వస్తుంది ఏమో చూడాలి..!!