మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరుతో పాటు తనయుడు రామ్‌చరణ్ కలిసి నటించినా ఆచార్యను ప్రేక్షకులు ఆదరించలేదు. ఈ సినిమా మెగాభిమానులను కూడా బాగా డిజప్పాయింట్ చేసింది. ఇక చిరు లైనఫ్లో ఇప్పుడు మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. మోహనరాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్ – మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ భోళాశంకర్ – బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య – వెంకీ కుడుముల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించే మరో సినిమాతో పాటు రీసెంట్గా తన తోటి హీరోయిన్ రాధిక బ్యానర్లో కూడా ఓ సినిమా చేసేందుకు చిరు ఓకే చెప్పారు.
ఈ క్రమంలోనే చిరు గాడ్‌ఫాదర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రెడీ అయిపోయింది. మళయాళంలో హిట్ అయిన లూసీఫర్‌కు రీమేక్‌గా ఇది వస్తోంది. తెలుగులో అప్పుడెప్పుడో హనుమాన్ జంక్షన్ సినిమాను డైరెక్ట్ చేసిన మోహనరాజా ఈ సినిమాకు దర్శకుడు. నయనతార హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ దాదాపు కన్ఫార్మ్ చేశారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మూడు రోజుల ముందే అంటే ఆగస్టు 12న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు రానున్నారు. ఇండిపెండెన్స్ డే వీకెండ్ క్యాష్ చేసుకోవాలని వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అదే రోజు అక్కినేని హీరో అఖిల్ ఏజెంట్ కూడా లీక్ అయ్యి ఉంది. మెగాస్టార్‌తో అఖిల్ పోటీ అంటే ఏజెంట్ పని కష్టమే అవుతుంది.
పైగా అక్కినేని మాజీ కోడలు సమంత నటించిన థ్రిల్లర్ మూవీ యశోద కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ, అమీర్‌తో అతడు నటిస్తోన్న లాల్‌సింగ్ చద్దా కూడా ఆగస్టు 11న రిలీజ్ అవుతోంది. మరి ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బాక్సాఫీస్ మామూలుగా హీట్ ఎక్కదనే చెప్పాలి.
ఇక చిరు గాడ్ ఫాదర్ విషయానికి వస్తే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సైతం ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.