అమ్మ.. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. మన పెద్ద వాళ్లు చెప్పిన్నట్లు ..దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అది నిజం. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం. ప్రపంచంలో నిజమైన కోటీశ్వరుడు ఎవరో తెలుసా అమ్మ ప్రేమను దక్కించుకున్న వారే. అమ్మ ప్రేమ కన్నా విలువైనది మరేది లేదు. ఓ సినీ కవి చెప్పినట్లు అమ్మే ఈ జగతికి మూలం అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ జగత్తులో అత్యంత నిస్వార్థ జీవి ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా అమ్మే అని చెప్పాలి. ‘ఇంటర్నేషనల్ మదర్స్ డే’ సందర్భంగా… పలువురు స్టార్ సెలబ్రిటీలు వాళ్ల అమ్మలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వాళ్ళల్లో చీరంజీవి షేర్ చేసిన వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. నెట్టింట టాప్ ట్రెండింగ్ లో ఉంది. మెగా బ్రదర్స్ ముగ్గురుని ఒక్కే ఫ్రేమ్ లో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మెగా బ్రదర్స్ ముగ్గురు కలిసి తల్లి అంజనా దేవితో గడిపిన ఎమోషనల్ మూమెంట్స్‌ను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. ఓ సందర్భంలో చిరు, నాగబాబు, పవన్ కళ్యాణ్ ,అంజనమ్మ కలిసి భోజనం చేస్తున్న వీడియోని షర్ చేస్తూ అందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వీడియో బ్యాగ్రౌండ్ లో పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా వకీల్ సాబ్ మూవీలోని పాట మ్యూజిక్ వినిపిస్తోంది. మెగా బ్రదర్స్ ముగ్గురు షూటింగ్ స్పాట్లో ఉండగా తల్లి అంజనా దేవి అక్కడికి వెళ్లారు. ముగ్గురు కొడుకులతో కలిసి భోజనం చేసిన అంజనా దేవి..ఆ తరువాత సరదాగా నలుగురు కలిసి కబుర్లు చెప్పుకున్నట్లు ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఇక ఆ తరువాత అంజనా దేవిని దగ్గరుండి కారెక్కించారు. మొత్తంగా ఈ వీడియో ఎమోషనల్ గా ఉంటూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇదంతా ఎక్కడో షూటింగ్ లొకేషన్ లోనే వీరంతా తమ తల్లితో ఉన్నారు. ఈ వీడియో చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు మెగా బ్రదర్స్. ఈ వీడియో ని షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అమ్మలందరికీ అభివందనములు !#HappyMothersDay to All The Mothers of the World! pic.twitter.com/FNiVxdY2QL
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 8, 2022