Moviesహెల్త్ మినిస్టర్ కావాలని ఉందట..మనసులో మాట చెప్పేసిన మహేశ్..!!

హెల్త్ మినిస్టర్ కావాలని ఉందట..మనసులో మాట చెప్పేసిన మహేశ్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ..”సర్కారు వారి పాట”. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను పరశూరామ్ డైరెక్ట్ చేశారు. మే 12 న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

కాగా, సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పనుల్లో బిజీ గా మారారు సినిమా హీరో మహేశ్, డైరెక్టర్ పరశూరామ్..హీరోయిన్ కీర్తి సురేష్. ఈ క్రమంలోనే ప్రముఖ ఛానెల్ కి ఇంటర్వ్యు ఇచ్చిన మహేశ్, పరశూరామ్..సినిమాకి సంబంధించిన బోలెడు విషయాలను అభిమానులతో పంచుకున్నారు.యాంకర్ గా సుమ తనదైన స్టైల్ లో పంచ్ లు విసురుతు..ఇంటర్వ్యుని సరదాగా తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే నాన్న గారి అభిమానులు ఇప్పటికీ అభిమానించటం, రాజకుమారుడు సినిమా నుంచి వాళ్లు చూపించిన అభిమానం మరవలేనిదన్నారు మహేశ్. సినిమా సినిమాకి వాళ్ళు తన పై చూపించే ప్రేమాభిమానాలు విలువ కట్టలేనిది అంటూ చెప్పుకొచ్చారు.


ఇక సరదాగా ఓ గేమ్ ఆడించిన సుమ..తాను కొన్ని మినిస్టరీ పోస్ట్లు పేర్లు చెప్పుతాను అని..అది ఎవ్వరికి బాగా సూట్ అవుతుందో చెప్పాలని చెప్పింది. ఇక సుమ హెల్త్ మినిస్టరి ఎవ్వరికి ఇస్తారు అని అడగానే టక్కున మహేశ్..అదైతే నేనే తీసుకుంటా అంటూ మనసులోని మాటను బయటపెట్టేశారు. ఆ తరువాత మరి కొన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఎవరికి కేటాయిస్తారని సుమ మహేశ్‌, పరుశురామ్‌లను అడుగుతూ వచ్చింది . వాళ్లల్లో గాసిప్ మినిస్టర్ గా- నిర్మాత రవి బాగా సెట్ అవుతారని.. సోషల్ మీడియా మంత్రిగా- థమన్ అయితే సూపర్ గా ఉంటారని.. ఈవెనింగ్ పార్టీల మినిస్టర్‌గా – నిర్మాత నవీన్ యెర్నేని గుడ్ అని.. క్రమశిక్షణ శాఖకు – ఎగ్డికూటివ్ ప్రొ. ఈపీ రాజు బాగుంటారు అని..ఇక ఫైనల్ గా ఫ్యాషన్ మినిస్ట్రీకి ది పర్ ఫెక్ట్ మ్యాచ్ హిరోయిన్ కీర్తి సురేష్‌ అండ్ టీమ్ సూపర్ పర్‌ఫెక్ట్‌గా సరిపోతారంటూ సమాధానమిచ్చి..కాసేపు సరదాగా నవ్వుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news