Movies' స‌ర్కారు వారి పాట‌ ' ను టెన్ష‌న్ పెడుతోన్న మ‌హేష్...

‘ స‌ర్కారు వారి పాట‌ ‘ ను టెన్ష‌న్ పెడుతోన్న మ‌హేష్ బ్యాడ్ సెంటిమెంట్‌…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత రెండున్న‌రేళ్ల గ్యాప్ తీసుకుని మ‌హేష్ న‌టించిన ఈ సినిమాకు ప‌ర‌శురాం పెట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గీత గోవిందం త‌ర్వాత నాలుగేళ్ల పాటు ఈ క‌థ మీద వ‌ర్క్ చేసిన ప‌ర‌శురాం సినిమా విజ‌యంపై చాలా కాన్ఫిడెంట్‌గానే ఉన్నాడు. బ‌ల‌మైన క‌థ‌, యాక్ష‌న్‌, కీర్తి – మ‌హేష్ రొమాంటిక్ ట్రాక్.. థ‌మ‌న్ సాంగ్స్‌, బీజీఎం ఇవ‌న్నీ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి.

ఇక ఏ రంగంలో అయినా సెంటిమెంట్లు కామ‌న్‌. కొన్ని హిట్ సెంటిమెంట్లు… కొన్ని ఫ‌ట్ సెంటిమెంట్లు ఉంటాయి. మ‌న టాలీవుడ్‌లో హీరోలు – హీరోయిన్ల సెంటిమెంట్లు, హీరోలు – ద‌ర్శ‌కుల సెంటిమెంట్లు, హీరోలు – నిర్మాత‌ల సెంటిమెంట్లు చాలా ఎక్కువుగా న‌మ్ముతూ ఉంటారు. ఇక ఈ రోజు రిలీజ్ అవుతోన్న మ‌హేష్‌బాబు స‌ర్కారు వారి పాట సినిమాను మ‌హేష్‌కు క‌లిసి రాని ఓ బ్యాడ్ సెంటిమెంట్‌తో పోలుస్తూ సోష‌ల్ మీడియాలో కొంద‌రు చ‌ర్చ పెడుతున్నారు.

మే 12న ఈ సినిమా వ‌స్తోంది. గ‌తంలో కూడా మ‌హేష్ న‌టించిన కొన్ని సినిమాలు మే నెల‌లో రిలీజ్ అయ్యాయి. అయితే అవి పెద్ద‌గా మ‌హేష్ కెరీర్‌కు క‌లిసి రాలేదు. ఒక్క‌డు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌హేష్‌బాబు తేజ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన నిజం ప్లాప్ అయ్యింది. ర‌క్షిత హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాను తేజ ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కించినా స‌క్సెస్ కాలేదు. అయితే ఈ సినిమాకు మ‌హేష్‌కు ఉత్త‌మ న‌టుడు అవార్డు వ‌చ్చింది.

ఇక ఆ మ‌రుస‌టి యేడాది 2004 మే 14న విడుదలైన నాని కూడా ఫ్లాప్ అయ్యింది. ఖుషి లాంటి యూత్ ఫుల్ హిట్ ఇచ్చిన ఎస్‌.జె. సూర్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాతో మ‌హేష్‌బాబుకు మంచి న‌టుడు అన్న మార్కులు వ‌చ్చినా సినిమా ప్లాప్ అయ్యింది. అమీషా ప‌టేల్ హీరోయిన్‌గా చేసింది. ఇక
2016 మే 20న విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ సినిమాతో మ‌హేష్ ప‌రువు తీసేసిన‌ట్టు అయ్యింది. ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల క‌థ రెడీ చేయ‌కుండా సినిమా చేయ‌డ‌మే ఈ సినిమా ఇంత ప్లాప్ అవ్వ‌డానికి కార‌ణం.

ఇలా మ‌హేష్ కెరీర్‌లో మే నెల‌లో వ‌చ్చిన మూడు సినిమాలు పెద్ద డిజాస్ట‌ర్లు అయ్యాయి. అయితే వీళ్ల‌కు ఊర‌ట ఇచ్చే న్యూస్ కూడా ఉంది. ఇదే నెల‌లో అంటే 2019 మే 9న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. సూపర్ స్టార్ 25 సినిమాగా వచ్చిన మహర్షి రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. ఇలా మే నెల‌లో వ‌చ్చిన నాలుగు సినిమాల్లో ఒక్క సినిమా మాత్ర‌మే హిట్ కాగా.. మిగిలిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. మ‌రి స‌ర్కారు వారి పాట‌తో మ‌హేష్ త‌న‌కు క‌లిసి రాని మే నెల బ్యాడ్ సెంటిమెంట్‌ను ఎలా ? చిత్తు చేస్తాడో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news