Moviesస‌ర్కారు వారి పాట టైటిల్ లీక్‌.. మ‌హేష్‌కు ఫోన్ చేసి షాక్...

స‌ర్కారు వారి పాట టైటిల్ లీక్‌.. మ‌హేష్‌కు ఫోన్ చేసి షాక్ ఇచ్చిన న‌మ్ర‌త‌..!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన తాజా సినిమా స‌ర్కారు వారి పాట‌. రెండున్న‌రేళ్ల క్రితం సంక్రాంతికి మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్ట‌ర్‌. స‌రిలేరు నీకెవ్వ‌రు సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ రెండున్న‌రేళ్ల‌లో క‌రోనా మూడుసార్లు వ‌చ్చింది. సినిమా రంగం ఎన్నో ఆటుపోట్ల‌కు గురైంది. అయినా మ‌హేష్ మాత్రం స‌ర్కారు వారి పాట సినిమాపై ఉన్న న‌మ్మ‌కంతో చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమాకు ప‌నిచేశాడు.

అటు గీత‌గోవిందం లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత పెట్ల ప‌ర‌శురాం స‌ర్కారు వారి పాట సినిమా కోస‌మే ఏకంగా నాలుగేళ్లు ప‌నిచేశాడు. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై ప్రి రిలీజ్ బ‌జ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ రేంజ్‌లో ఉంది. పైగా స్టిల్స్‌, ట్రైల‌ర్లు, సాంగ్స్ అన్ని కూడా సోష‌ల్ మీడియాను ఊపేస్తున్నాయి. మ‌హేష్ – కీర్తి సురేష్ జంట కూడా క్యూట్ లుక్స్‌తో చంపేస్తోంది. వీరిద్ద‌రి రొమాంటిక్ ట్రాక్ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను, యూత్‌ను ఊపేస్తుంద‌నే అంటున్నారు.

 

ఇక ఈ సినిమా క‌రోనా దెబ్బ‌తో రెండేళ్ల పాటు షూటింగ్ జ‌రుపుకుంది. అయితే మ‌హేష్‌కు మాత్రం స్క్రిఫ్ట్ మీద ఉన్న న‌మ్మ‌కంతో అలాగే షూటింగ్ చేసుకుంటూ.. అంతే కాన్పిడెంట్‌తో ఉన్నాడ‌ట‌. అయితే స‌ర్కారు వారి పాట టైటిల్ ముందుగా మ‌హేష్‌కు తెలియ‌ద‌ట‌. ఓ రోజు జిమ్‌లో ఉండ‌గా.. న‌మ్ర‌త ఫోన్ చేసి సినిమా టైటిల్ లీక్ అయిపోయింది.. మీకు తెలుసా అని అడిగింద‌ట‌. అమెరికాలో కూడా టైటిల్ గురించి బాగా చ‌ర్చించుకుంటున్నార‌ని చెప్ప‌డంతో మ‌హేష్ తెల్ల‌బోయాడ‌ట‌.

వెంట‌నే మ‌హేష్ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాంకు ఫోన్ చేసి టైటిల్ ఏంటండి అని అడిగాడ‌ట‌. అటు ప‌ర‌శురాం కూడా స‌ర్కారు వారి పాట అనుకుంటున్న‌ట్టు చెప్ప‌డంతో షాక్ అవ్వ‌డం మ‌హేష్ వంతు అయ్యింద‌ట‌. చివ‌ర‌కు అదే టైటిల్ క‌న్‌ఫార్మ్ చేస్తూ రివీల్ చేశారు. ఓ టైటిల్ సౌండ్ మిక్సింగ్‌కు, డిజైనింగ్‌కు ఇలా ర‌క‌ర‌కాల టెక్నిక‌ల్ టీంల‌కు వెళుతుంద‌ని.. అక్క‌డ నుంచి ఇది లీక్ అయిపోతూ ఉంటుంద‌ని ప‌ర‌శురాం చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news