ఆచార్య సినిమాకు ముందు వరకు కొరటాల శివ అంటే ఎంత క్రేజ్ ఉండేదో చూశాం. మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ మిర్చి – శ్రీమంతుడు – జనతా గ్యారేజ్ – భరత్ అనే నేను ఇలా వరుస హిట్లతో తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. కట్ చేస్తే ఆచార్య సినిమా కోసం కొరటాల ఏకంగా నాలుగేళ్లు టైం వేస్ట్ చేశాడు. ఎన్నో కష్టాలు దాటుకుని, మూడు దశల కరోనా వేవ్‌లను ఎదుర్కొని ఏప్రిల్ 29న థియేటర్లలోకి వచ్చిన ఆచార్య డిజాస్టర్ అయ్యింది.
ఈ సినిమా మామూలుగా ప్లాప్ అయినా.. ఓ మోస్తరుగా ఆడినా పరిస్థితి వేరేగా ఉండేది. అసలు చిరు కెరీర్‌లోనే రీ ఎంట్రీ తర్వాత ఓ మాయని మచ్చగా మిగిలిపోయేంత ప్లాప్ అయ్యింది. చిరంజీవి – రామ్‌చరణ్ – కొరటాల శివ ముగ్గురు కలిసి ఉన్నా కూడా ఈ సినిమా రు. 50 కోట్ల షేర్ రాబట్టలేదు అంటే ఈ సినిమా ఎంత ప్లాపో అర్థం చేసుకోవచ్చు. సినిమా కొన్న బయ్యర్లు అందరూ నిండా మునిగిపోయారు. నాలుగేళ్లు కష్టపడిన కొరటాల చేతికి ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆయన పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.
నాలుగు హిట్ సినిమాలు తీసిన కొరటాల ప్లాప్ సినిమా తీసినా ఇంత ఘోరంగా అయితే తీసి ఉండడు.. ఇందులో కెలకుళ్లు, వేళ్లు పెట్టడాలు కూడా ఎక్కువైపోయాయనే అన్నవారు కూడా ఉన్నారు. ఏదేమైనా ఆచార్య ఎఫెక్ట్‌తో కొరటాల చాలా రియలైజ్ అయ్యాడు. ఇక ఇప్పుడు కొరటాల ఎన్టీఆర్‌తో #NTR30 సినిమా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ క్రమంలోనే తన టెక్నికల్ టీం నుంచి ఇద్దరిని పీకేశాడు. ఎన్టీఆర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచంద్రన్, సినిమాటోగ్రాఫర్‌గా ఆర్. రత్నవేలును తీసుకున్నారు. అలాగే ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు సిరిల్, ఎడిటర్‌గా శ్రీకరప్రసాద్‌లను ఎంపిక చేశారు. ఈ టీంలో ఎడిటర్ మినహా మిగిలిన వారు అందరితోనూ కొరటాల ఫస్ట్ టైం వర్క్ చేయబోతున్నాడు.
ఆచార్యకు కొరటాల నాలుగు సినిమాలకు పనిచేసిన దేవిశ్రీ ప్రసాద్‌ను కాదని చిరు సూచన మేరకు మణిశర్మను తీసుకున్నారు. పాటలు.. బ్యాక్ గ్రౌండ్ అట్టర్‌ప్లాప్ అయ్యింది. ఇక సినిమాటోగ్రాఫర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మది, తిరుతో మాత్రమే పనిచేశాడు. ఈ సారి వారిని పక్కన పెట్టేసి రత్నవేలును తీసుకున్నారు. ఆచార్యలో ఓపెనింగ్ షాట్లు, ఎలివేషన్ షాట్స్ కొరటాల ముందు సినిమాల స్థాయిలో లేవనే అన్నారు. ఇక్కడ దర్శకుడికి, డీవోపీ కొత్త ఐడియాలు ఇవ్వకపపోవడం దెబ్బేసిందని టాక్ ? అందుకే డీవోపీని కూడా కొరటాల మార్చేశాడట.
అందుకే ఇప్పటి వరకు తన సక్సెస్‌లలో భాగమైన మది, దేవి లాంటి వాళ్లను పక్కన పెట్టేసి ఇప్పుడు రత్నవేలు, అనిరుధ్ లాంటి వాళ్లతో వర్క్ చేసేందుకు సిద్ధమైనట్టే కనిపిస్తోంది. మరి ఈ కొత్త టీమ్ కొరటాలకు ఎంత వరకు కలిసి వస్తుందో ? చూడాలి.