కొద్ది రోజుల గ్యాప్‌లో భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి త్రిబుల్ ఆర్, కేజీయఫ్ 2. ఈ రెండు కూడా సౌత్ ఇండియన్ సినిమాలే. త్రిబుల్ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా. టాలీవుడ్‌లోనే ఇద్దరు క్రేజీ యంగ్‌స్టర్స్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కలిసి ఈ సినిమాలో నటించారు.
పైగా బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా ఇదే. ఇక నాలుగేళ్ల క్రితం వచ్చిన కేజీయఫ్ సినిమాకు కంటిన్యూటిగా వచ్చింది కేజీయఫ్ 2. కేజీయఫ్ హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్‌పై కూడా ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. రెండు వారాల గ్యాప్‌లో ముందుగా త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత కేజీయఫ్ థియేటర్లలోకి వచ్చింది.
రెండు సినిమాలు కూడా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీగా తలపడ్డాయి. ఫైనల్‌గా త్రిబుల్ ఆర్ సినిమా ఫైనల్ కలెక్షన్లలో కేజీయఫ్ 2 కంటే పై చేయి సాధిస్తుందనే అందరూ అనుకున్నారు. అయితే ఆ అనుమానాలు కేజీయఫ్ 2 పటాపంచలు చేసేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా త్రిబుల్ ఆర్ వసూళ్లను కేజీయఫ్ 2 క్రాస్ చేసేసింది.
త్రిబుల్ ఆర్ వసూళ్ల దరిదాపుల్లోకి కూడా కేజీయఫ్ రాదనే అందరూ అనుకున్నారు. కట్ చేస్తే ఇండియాలో కేజీయఫ్ 930 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డు సెట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్‌గా చూస్తే త్రిబుల్ ఆర్ రు. 1127 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు కేజీయఫ్ కు రు 1107 కోట్ల వసూళ్లు వచ్చాయి.
అంటే వరల్డ్ వైడ్ లెక్కలు చూస్తే మరో రు. 20 కోట్లు మాత్రమే కేజీయఫ్ వెనకపడి ఉంది. అంటే మరో రెండు, మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా కూడా త్రిబుల్ ఆర్ రికార్డును కేజీయఫ్ బీట్ చేసేసేలా ఉంది. విచిత్రం ఏంటంటేత్రిబుల్ ఆర్ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు చూశారు. కేజీయఫ్‌ను ఓ సెక్షన్ ప్రేక్షకులు చూడనే లేదు. అయినా కూడా త్రిబుల్ ఆర్ వరల్డ్ వైడ్ వసూళ్లు బీట్ చేయడం గ్రేట్. అలాగే త్రిబుల్ ఆర్ హిందీ బెల్ట్ వసూళ్లు దెబ్బేయడం కూడా ఈ సినిమా ఇక్కడితో ఆగిపోవడానికి మరో కారణం.