మహేష్‌బాబు సర్కారు వారి పాట సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఒకటి, రెండు మైనస్‌లు ఉన్నా కూడా ఓవరాల్‌గా సినిమా హిట్ టాక్‌తోనే జర్నీ స్టార్ట్ చేసింది అన్నది వాస్తవం. అయితే రిలీజ్‌కు ముందు హీరో మహేష్‌తో పాటు, దర్శకుడు పరశురాం.. చివరకు ఏ సినిమాకు పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వని సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ లాంటి వాళ్లు సైతం సినిమా అదిరిపోయిందని.. తమ కెరీర్‌లోనే పోకిరి తర్వాత ఆ రేంజ్‌లో ఈ సినిమా చూశామని చెప్పడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
సినిమా దూకుడు, పోకిరి రేంజ్‌లో ఉంటుందని మహేష్ చెప్పడంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఆ అంచనాలతో థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులు ఆ స్థాయిలో లేకపోవడంతో కాస్త డిజప్పాయింట్‌కు గురయ్యారు. ఇక గురువారం ఉదయం నుంచే మహేష్ యాంటీ ఫ్యాన్స్‌తో పాటు ఓ సెక్షన్ హీరోల అభిమానులు కూడా #DisasterSVP అనే హాష్ ట్యాగ్ తో వైరల్ చేయడంతో పాటు దీనిని ఏకంగా ట్రెండింగ్ లోకి తీసుకు వచ్చేశారు.
వాస్తవంగా సినిమా యబో యావరేజ్… ఎక్కడా అశ్లీలత, అసభ్యత అన్న దానికి తావు లేకుండా ఫ్యామిలీతో సహా వెళ్లి మరీ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. దీనికి తోడు సినిమాలో మహేష్ చెప్పిన నేను విన్నాను… నేను ఉన్నాను డైలాగ్ ఓ పార్టీకి అనుకూలంగా ఉందంటూ మరో ప్రచారం తెచ్చి సినిమాకు ఏదోలా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే పనికి శ్రీకారం చుట్టారు. దీనికి తోడు ఉత్తరాంధ్ర, సీడెడ్ ఏరియాల్లో సైక్లోన్ దెబ్బ కూడా పడింది. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి.
ఫస్ట్ డే ఈ రెండు ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా డల్‌గానే ఉన్నాయట. దీంతో ఎక్కడైనా ఖాళీ కుర్చీలు కనపడితే వాటిని స్క్రీన్ షాట్లు తీసి ఫస్ట్ డే ఫస్ట్ షోకే జనాలు లేరంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్లుగా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా సూపర్ అంటూ ఈ రెండు హీరోల ఫ్యాన్స్ గ్రూపుల్లో మెసేజ్‌లు వైరల్ చేస్తున్నారు.
నిన్న ఉదయం నుంచే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేజుల్లో సర్కారు వారి పాట బాగుందని… రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతుందని మెసేజ్‌లు పెడుతున్నారు. ఇటు ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను ఓ సెక్షన్ వాళ్లు గట్టిగా టార్గెట్ చేయడంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు కూడా మహేష్ సినిమా మీద చేస్తోన్న ఎటాక్‌ను తిప్పికొడుతూ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు.