శృంగారం అనేది ఆరోగ్యానికి ఎంత మేలు చూకూరుస్తుందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఓ బాలీవుడ్ హీరోయిన్ సైతం శృంగారంలో ఎంత ఎక్కువ పాల్గొంటే అంత ఎక్కువ ఉత్తేజం వస్తుందని… అంత ఎక్కువ కాలరీలు ఖర్చవుతాయని… శృంగారం మంచి వర్కవుట్ అని చెప్పిన సంగతి తెలిసిందే. నిజానికి మనిషికి ఆకలి, దప్పిక తీర్చుకోవడం ఎంత అవసరమో శృంగారం అనేది కూడా అంతే ముఖ్యం. శృంగారం మనిషిని ఎప్పుడూ ఉత్తేజ పరుస్తూ… ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
అయితే ప్రస్తుతం మారుతోన్న సమాజ పరిస్థితుల వల్ల భార్య, భర్తలు తరచూ శృంగారంలో పాల్గోలేకపోతున్నారు. పని వేళలు, ఒత్తిడి, సంపాదనలో పడి శృంగారం గురించి మర్చిపోవడం.. అక్రమ సంబంధాలతో భార్యలు / భర్తలకు దూరం కావడం… తగ్గుతోన్న లైంగీకాసక్తి ఇలా చాలా కారణాలు మనుష్యుల్లో శృంగార వాంఛ తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెప్పాలి.
మనదేశంలో శృంగారం కోసం ఆడవాళ్ల కంటే మగవాళ్లే కాస్త ఎక్కువ తొందర పెడుతూ ఉంటారట. ఆడవాళ్లను లోబర్చుకునేందుకు మగవాళ్లు రకరకాల ప్రయత్నాలు చేస్తారట. ఆ సమయంలో ఆడవాళ్లు ఇష్టపడకపోయినా… వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మగవాళ్లు అవేమి పట్టించుకోకుండా తమ కోరిక తీర్చుకునేవరకు ఆడవాళ్లను లబోరచుకునే ప్రయత్నాలు అయితే చేస్తారట. ఆ సమయంలో ఆడవాళ్లు ఏదో ఒక ఇబ్బందితో మగవాళ్లను దూరం పెడితే చివరకు మగవాళ్లు ఎమోషనల్గా మారిపోయి తమ పంతం నెగ్గేవరకు ఆడవాళ్లపై తమ ఆధిపత్యం చూపిస్తారట.
ఇక లైంగీకత్వంతో పాటు శృంగారం పట్ల అవగాహన లేని వారు… కేవలం డబ్బు సంపాదనలో పడి దీని గురించి మర్చిపోయేవారు కూడా ఉంటారు. వీరి వల్ల దాంపత్య జీవితంలో చాలా సమస్యలు కూడా వస్తుంటాయి. విచిత్రం ఏంటంటే భారతదేశంలో లైంగీక జీవన విషయంలో చదువుకోని వారు కంటే చదువుకున్న వారే సరైన అవగాహన తెచ్చుకోవడం లేదని తేల్చిచెప్పింది.
ఈ సర్వే ప్రకారం మన దేశంలో విద్యావంతులు, ఉద్యోగులు అయిన భర్తలు … భార్యలు తమతో శృంగారానికి నో చెపితే వాళ్లకు ఆర్థిక సాయం చేసేందుకు నిరాకరిస్తారట. తమ కోరిక కాదన్నందుకు కోపం తెచ్చుకున్న భర్తలు… భార్యను నానా విధాలుగా ఇబ్బందులు పెట్టి వారిని ఏదోలా తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తారట. అదే తమ మనస్సుకు ఉల్లాసం కలిగించడంతో పాటు తమతో శృంగారాన్ని ఆస్వాదించి.. ఉత్తేజం కలిగిస్తే ఎంత డబ్బు అయినా ఇచ్చేందుకు వెనుకాడరట.