Moviesఇలియాన ఆ తప్పు చేయకపోయుంటే..కధ మరోలా ఉండేది..!?

ఇలియాన ఆ తప్పు చేయకపోయుంటే..కధ మరోలా ఉండేది..!?

ఇలియానా.. ఇప్పుడంటే ఈ పేరుకి పెద్ద వాల్యు లేదు కానీ..వామ్మో అప్పట్లో అమ్మడు పేరు చెప్పితే పిచ్చెక్కి ఊగిపోయే జనాలు చాలా మందే ఉన్నారు, ముఖ్యంగా ఇలియానా అంటే ఆ నడుము అందాలు. ఉందా లేదా అన్నట్లు ఉండే నడుము ని చూసి..అస్సలు నడుము అంటే ఇలానే ఉండాలి అనే రేంజ్ కి వచ్చేశారు జనాలు. ఆ నడుము కోసమే అబ్బాయిలు సినిమాలు చూసేవాళ్ళు అనడంలో సందేహం లేదు. ఆ నడుము అందాలతోనే టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది స‌న్న న‌డుము సుంద‌రి ఇలియానా.

2005లో వ‌చ్చిన దేవ‌దాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచమయమైన గొవా బ్యూటీ.. దేవదాసు ద‌గ్గ‌ర నుంచే ఆమె త‌న బ‌క్క‌పల్చ‌ని అందాల‌తో కుర్రాళ్ల‌ను టార్గెట్ చేసింది. దేవ‌దాసు సినిమాలో ఇలియానాను చూసిన తెలుగు యూత్ ఆమె ఇచ్చిన కిక్‌తో పిచ్చెక్కిపోయారు. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక అప్ప‌ట్లో అమ్మాయిల‌ను ఎవ‌రైనా పొగ‌డాలి అంటే ఇలియానాలా ఉన్నావు అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచేత్తేవారు.

ఇక రెండో సినిమాకే మహేశ్ బాబుతో నతించే ఛాన్స్ అందుకుంది. పోకిరి సినిమాతో ఏకంగా కుర్ర‌కారు గుండెల్లో కాపుర‌మే పెట్టేసింది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ద‌శాబ్దం పాటు ఎంత‌మంది హీరోయిన్లు వ‌చ్చినా ఆమె అందం ముందు ఆనలేకపోయారు. స్టార్ హీరోల ప‌క్క‌న వ‌రుస పెట్టి ఛాన్సులు ద‌క్కించుకుంది.

ఆ టైంలో ఇలియానాతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ టాప్ హీరోలు, ద‌ర్శ‌కులు వెంట ప‌డేవారు. దేవుడు చేసిన మ‌నుషులు సినిమా త‌ర్వాత ఆమె బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇక్క‌డ స్టార్ డ‌మ్ ఉండ‌గానే దానిని వ‌దులుకుని బాలీవుడ్‌కు వెళ్లిన ఇలియానాకు అక్క‌డ హిట్లు లేవు.

ఆ తరువాత ఇక్కడకు మళ్లి వచ్చి సినిమాలు అంటూ ట్రై చేసిన ఆఫర్లు దక్కలేదు. అదే అమ్మడు బాలీవుడ్ మీద మోజు పడకుండా టాలీవుడ్ లోనే సినిమాలు చేసి ఉంటే..ఫ్లాప్ సినిమాలు పడ్డా.. ఇప్పుడు శ్రియ లాగా ఏవో ఇంపార్టెంట్ రోల్స్ అయిన చేస్తూ..ఫాంలో ఉండేది. ఇప్పుడు అటు బాలీవుడ్ లో ఆఫర్లు లేక..ఇటు టాలీవుడ్ లో లేక..ఖాలీగా టైం పాస్ చేస్తుంది గోవా బ్యూటీ.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news