స్టార్ హీరోల సినిమాల షూటింగ్ జరుగుతుందంటే భారీ ఖర్చవుతుంది. హీరోల ఒక్క రోజు కాల్షీటు వేస్ట్ అయితే ఎన్నిలక్షలు వృథా అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోల సినిమా షూటింగ్ అంటే వందల్లో జూనియర్ ఆర్టిస్టులు, టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్లు… దర్శకులు, వాళ్ల టీంతో పాటు ఆర్ట్ వర్క్ వాళ్లు అసలు ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా మందే సెట్స్‌లో ఉంటారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా షూటింగ్ అంటే ఒక్క రోజు ఖర్చే భారీగా ఉంటుంది. చిన్న హీరోల సినిమాలకే మామూలు రోజువారి షూటింగ్ ఖర్చు రు. 2 – 3 లక్షలు ఉంటుంది. అదే పవన్ సినిమాకు అయితే రు. 8 – 10 లక్షల వరకు ఖర్చువుతుంది. తాజాగా పవన్ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఏఎం. రత్నం నిర్మిస్తోన్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ జరుగుతోంది.
క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి కూడా మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. పవన్ సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లోనూ బిజీగా ఉండడంతో ఈ సినిమాకు సడెన్‌గా షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తోందట. దీంతో నిర్మాత రత్నంకు ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు.
భీమ్లానాయక్‌కు కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురైనా మధ్యలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఉండడంతో ఆయన పవన్ డేట్లు సర్దుబాటు చేయడంతో ఆ సినిమాకు ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు రాజకీయంగా కూడా పవన్ యాక్టివ్‌గా ఉండాల్సి ఉంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అప్పుడప్పుడు పర్యటనలకు వెళుతున్నారు.
అందుకే క్రిష్ హరిహర వీరమల్లు విషయంలో ఒక్కోసారి సెడన్‌గా షెడ్యూల్స్ క్యాన్సిల్ అవుతున్నాయంటున్నారు. ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి ఆ వెంటనే హరీష్ శంకర్ భవదీయుడు భగత్‌సింగ్‌ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు.