సాయి పల్లవి..ఓ హై బ్రీడ్ పిల్ల. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నాకానీ, పల్లవి కి ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తెలుగు ఇండస్ట్రీలోఖి ఫిదా సినిమాతో ఎంటర్ అయిన ఈ ముద్దుగుమ్మా..మొదటి సినిమాతోనే ఓ రేంజ్ లో పొగడ్తలను దక్కించుకుంది. తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకునేసింది ఈ మలయాళ బ్యూటీ. ఆ తరువాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ.. గ్లామస్రస్ పాత్రలకు దూరంగా ఉంటూనే.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది.
నిజానికి సాయి పల్లవి చేసింది చాలా తక్కువ సినిమాలు .. అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం సాయి పల్లవి బాగా దగ్గర అయింది. ఆమె తన అందం తో కాకుండా..నటన తో బోలెదు మంది అభిమానులను సంపాదించుకుంది. ఎంతో సింపుల్ గా…స్కిన్ షో దూరంగా సినిమాలు చేస్తూ అలరిస్తుంది సాయి పల్లవి… ప్రజెంట్ కొత్త సినిమాలి ఏం సైన్ చేయ్యట్లేదు. స్టోరీలు నచ్చక అలా చేస్తుందో..లేక వేరే కారణం ఏదైన ఉందో తెలియదు కానీ..ప్రజెంట్ సాయి పల్ల్వి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అప్పుడెప్పుడో నటించిన రానాతో విరాటపర్వం ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరికి తెలియదు.
దీంతో సాయి పల్లవి కి పెళ్ళి ఫిక్స్ అయ్యిందని..అందుకే ఆమె సినిమాలకి దూరంగా ఉంటుందన్న వార్త తెగ వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలపై సాయి పల్లవి స్పందించలేదు కాని సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. సాయి పల్లవి కి పెళ్లంటూ వార్తలు రావడంపై సాయి పల్లవి ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఉన్నారు. అసలు లైఫ్ లో పెళ్లి చేసుకోనని చెబుతున్న సాయి పల్లవి కి ఇలా పెళ్లి అంటూ పుకార్లు పుట్టించదం ఏమాత్రం కరెక్ట్ కాదని చెబుతున్నారు. ఆమెకు నచ్చిన కధ దొరకకపోవడంతోనే సినిమాలకి సైన్ చేయడం లేదని..అంతేకానీ..ఆమె పెళ్లి ఫిక్స్ అవ్వలేదంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి ఈ వార్తలపై సాయి పల్లవి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.