తెలుగులో పలు సీరియల్స్‌లో నటించిన హరితేజ ఆ తర్వాత జెమినీ టీవీలో ప్రసారమైన చిన్నారి అనే సీరియల్‌తో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఈటీవీ, మాటీవీ తదితర ఛానెల్స్‌లో కూడా ఆమె బిగ్‌బాస్‌లో పాల్గోవడంతో బాగా పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్‌లోకి వెళ్లి వచ్చాక హరితేజ బయట బాగా పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్‌కు ముందే ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. బిగ్‌బాస్ తర్వాత హరితేజకు సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోవర్స్ పెరిగిపోయారు.
పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు చెపుతోంది. ఈ క్రమంలోనే తన భర్త గురించి తాను ఎలా అనుమానం వ్యక్తం చేశానో హరితేజ బాంబు పేల్చింది. తన భర్త దీపక్ తనను చాలా ప్రేమగా చూసుకుంటాడని.. తన ప్రొఫెషన్‌ను అర్థం చేసుకుని.. ఎంత లేటుగా ఇంటికి వెళ్లినా పెద్దగా పట్టించుకోడని చెప్పుకు వచ్చింది. అలాంటి భర్త దొరకడం తన అదృష్టమని చెప్పింది.
కొద్ది రోజుల క్రితం బరువు తగ్గడం కోసం తాను రెగ్యులర్‌గా భర్తతో కలిసి జిమ్‌కు వెళ్లేవాడిని అని.. జిమ్‌లో వర్కవుట్లు చేసే టైంలో ఓ అమ్మాయి పరిచయం అయ్యిందని.. తరచూ ఆ అమ్మాయితో మాట్లాడేవాడని..ఓ సారి డౌట్ వచ్చి తన ఫోన్ చేసి చెక్ చేస్తే వాళ్లిద్దరు తరచూ చాటింగ్ చేసిన మెసేజ్‌లు చూసి తనకు చాలా కోపం వచ్చిందని హరితేజ చెప్పింది.
ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావని అడిగానని.. ఇంకోసారి ఆ అమ్మాయితో మాట్లాడితే బాగోదని తన భర్తకు వార్నింగ్ కూడా ఇచ్చానని హరితేజ చెప్పింది. తన భర్త మరో అమ్మాయితో అంత చనువుగా మాట్లాడడం చూసి తాను తట్టుకోలేకపోయానని.. కొద్ది రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని కూడా చెప్పింది. అయితే ఆ అమ్మాయి చాలా మంచిదని చెప్పడంతో తాను కూల్ అయ్యానని.. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి తన భర్త దీపక్‌తో మరోసారి మాట్లాడలేదని చెప్పింది.
ఇక తాను మాత్రం అబ్బాయిలతో కలిసి పార్టీలకు, పబ్‌లకు వెళ్లినా తన భర్త ఏమి అనడని… దేని గురించి అడగడని అయితే ఎక్కడకు వెళ్లినా జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్పి ఫోన్ కట్ చేస్తాడని చెప్పింది. అలాంటి మంచి భర్త దొరికితే ప్రతి ఆడపిల్ల లైఫ్ చాలా బాగుంటుందని తన భర్తను ఆకాశానికి ఎత్తేసింది.